Mahesh Babu : 7 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీల‌ను వ‌దులుకున్న మ‌హేష్ బాబు.. అవి గానీ చేసి ఉంటేనా..?

July 13, 2022 3:25 PM

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న చేస్తున్న చిత్రాలు ఎక్కువ‌గా స‌మాజానికి మెసేజ్‌ను అందించేవే అయి ఉంటున్నాయి. కానీ ఆయ‌న గ‌తంలో భిన్న ప్ర‌యోగాలు చేసేవారు. అయితే మ‌హేష్ బాబు త‌న కెరీర్‌లో 7 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను వదులుకున్నారు. కొన్ని త‌న‌కు సెట్ కావ‌ని వ‌దిలేయ‌గా.. కొన్ని మాత్రం డేట్స్ కుద‌ర‌క వ‌దిలేయాల్సి వ‌చ్చింది. అయితే వాటిని గ‌న‌క‌ చేసి ఉంటే మ‌హేష్ రేంజ్ ఇంకా పెరిగి ఉండేద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక మ‌హేష్ బాబు త‌న కెరీర్ లో మిస్ చేసుకున్న ఆ 7 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మనసంతా నువ్వే చిత్రంలో మొదటగా మహేష్ కే ఆఫర్ వచ్చిందట. సినిమా నిర్మాత ఎం.ఎస్.రాజు ఈ సినిమా చేయాల‌ని కోరాడట. అయితే అప్పటికే మహేష్ బాబు రాజకుమారుడు, యువరాజు, మురారి.. సినిమాలు హిట్ అయి స్టార్ గా ఎదుగుతున్నాడు. దాంతో ఈ సినిమాని మహేష్ వదులుకున్నాడట. అయితే చిత్రం సినిమా విడుదల కావడం.. సినిమా సక్సెస్ అవడంతో ఉదయ్ కిరణ్ తెరపైకి వచ్చాడు. దీంతో ఈ సినిమా ఎంత హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు.

Mahesh Babu missed these 7 movies
Mahesh Babu

తరువాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఏమాయ చేశావె సినిమా కోసం మహేశ్ బాబుని అనుకున్నాడట. అయితే కారణం తెలియదు కానీ మహేష్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ మూవీ నాగ చైతన్య చేతికి వెళ్ళింది. ఈ సినిమా నాగచైతన్య కెరీర్ లొనే పెద్ద హిట్ అయ్యింది. అలాగే గోన గన్నా రెడ్డిగా అల్లు అర్జున్ క్యారెక్టర్ రుద్రమదేవి సినిమాలో ఫుల్ ఫేమస్ అయ్యింది. నిజానికి ఈ పాత్నుర మహేష్ బాబు చేయాల్సింది. కానీ ఎందుకో అల్లు అర్జున్ కి వెళ్ళిపోయింది. అలాగే విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 24. సూర్య గెటప్స్ ఈ సినిమాలో ది బెస్ట్. సూర్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. అయితే ఈ కథను ఫస్ట్ మహేష్ బాబుకే వినిపించాడట విక్రమ్. కానీ మహేష్ మాత్రం బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు సినిమాలకు కమిట్ అయ్యాడు. దీంతో డేట్స్ సర్దుబాటు కాలేదట. ఫలితంగా మరో హిట్ మూవీ మహేష్ ఖాతాలో రాలేదు.

ఇక తమిళ స్టార్ హీరో విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ వచ్చిన కత్తి సినిమా ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుని మహేష్ బాబుని సంప్ర‌దించారట. మహేష్ అందుకు ఒప్పుకోలేదట. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150గా మన ముందుకు వచ్చింది కత్తి సినిమానే. ఇది ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలుసు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఫిల్మ్ అ ఆ. ప్లాఫ్ లతో నితిన్ సతమతమవుతున్న టైంలో ఈ మూవీ అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ మహేష్ బాబుకే అవకాశం వచ్చినా.. రిజక్ట్ చేయడంతో నితిన్ కు ఆ అవకాశం దక్కింది. అలాగే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఫిదా సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది. తెలంగాణ యాస ఈ సినిమాకి కొంత ప్లస్. ఇంకా సినిమా కథ కూడా బాగుండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాని బంపర్ హిట్ చేశారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తన సినిమాలతో కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడు. కానీ శేఖర్ కూడా ఈ సినిమాకి ఫస్ట్ మహేష్ నే అనుకున్నాడట. కానీ ప్రిన్స్ మాత్రం ఈ స్టోరీ తనకు సెట్ కాదని చెప్పేశాడంట. దీంతో వరుణ్ తేజ్ ఖాతాలో సూపర్ హిట్ ప‌డింది. ఈ సినిమాతో సాయి పల్లవి రేంజ్ కూడా అమాంతం పెరిగింది.

ఇలా మ‌హేష్ బాబు త‌న కెరీర్‌లో ఎన్నో సినిమాల‌ను వ‌దులుకున్నారు. అవి బ్లాక్ బస్ట‌ర్ హిట్స్ అయ్యాయి. కొన్నింటిని త‌న‌కు సెట్ కావ‌ని ఆయ‌న వ‌దిలేయ‌గా.. కొన్నింటికి డేట్స్ కుద‌ర‌క వ‌దిలేశారు. అవే గ‌న‌క మ‌హేష్ ఖాతాలో ప‌డి ఉంటే మ‌హేష్ రేంజ్ ఇంకాస్త పెరిగి ఉండేద‌ని ఫ్యాన్స్ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now