Mahesh Babu : నాగచైతన్య లవ్‌ స్టోరీ సినిమా.. మహేష్‌ బాబుకు రూ.కోట్లలో ఆదాయం..!

October 21, 2021 4:39 PM

Mahesh Babu : కరోనా రెండవ దశ తర్వాత థియేటర్లు తెరుచుకుని చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్లలో విడుదల అయ్యి అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఒకటి అని చెప్పవచ్చు. ఈ సినిమా నిర్మాతలకు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ ఓనర్ లకి కూడా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక లవ్ స్టోరీ సినిమా మహేష్ బాబుకు రూ.కోట్లలో ఆదాయం తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.

Mahesh Babu got rs crores of income with love story movie

అసలు నాగ చైతన్య సినిమాకు, మహేష్ బాబు ఆదాయానికి సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే.. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా మహేష్ బాబు థియేటర్ ఏఎంబీ(AMB) సినిమాస్ మ‌ల్టీప్లెక్స్‌ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఈ థియేటర్లో 251 షోలు నిర్వహించగా ఈ సినిమా కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఇలా థియేటర్లలో కోట్లలో కలెక్షన్లు రాబట్టే సినిమాలు చాలా తక్కువ. చాలా పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ఈ విధంగా కోట్ల కలెక్షన్ రాబడతాయి. కానీ నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమాకి ఈ విధమైన కలెక్షన్లు రావడం గర్వించదగ్గ విషయం. ఇలా మహేష్ బాబు థియేటర్ లో విడుదలైన ఈ సినిమా ఆయనకు కూడా అధిక లాభాలను తెచ్చిపెట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now