Mahesh Babu : క‌ట్ట‌లు తెంచుకుంటున్న మ‌హేష్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం.. ఎందుకో తెలుసా ?

April 18, 2022 2:35 PM

Mahesh Babu : ఇటీవ‌లి కాలంలో అభిమానులు.. హీరోలు, నిర్మాత‌లతోపాటు యూనిట్‌పై తెగ ఫైర్ అవుతున్నారు. తాజాగా స‌ర్కారు వారి పాట చిత్ర బృందంపై మ‌హేష్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హేష్ ప్ర‌స్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపించడంతో మహేష్ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో కంప్లీట్ చేసేసే పనిలో ఉన్నారని టాక్.

Mahesh Babu fans very angry on Sarkaru Vaari Paata makers
Mahesh Babu

స‌ర్కారు వారి పాట సినిమా మే 12 కే విడుదలకానుందని అంటున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్‌‌ను విడుదల చేసింది టీమ్. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా.. సిద్ శ్రీరామ్ పాడారు. థమన్ సంగీతం అందించారు. ఈ పాటలో విజువల్స్ బాగున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. థమన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటి వరకు 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించి కేక పెట్టిస్తోంది.

ఇక ఈ సినిమా నుండి విడుద‌లైన మ‌రో సాంగ్.. పెన్నీ సాంగ్. ఈ పాట సూపర్ స్టైలిష్‌గా ఉంటూ.. ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. ఈ పాటలో మహేష్ కూతురు సితార ఘట్టమనేని చేసిన స్టైలిష్ పెర్ఫామెన్స్ మరో హైలైట్‌గా ఉంది. నాకాష్ ఆజీజ్ పాడగా.. అనంత శ్రీరామ్ రాశారు. ఇక మూడో పాటకు రంగం సిద్ధం అయ్యింది. అయితే ప్ర‌మోష‌న్స్ విష‌యంలో అల‌సత్వం ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో సర్కారు వారి పాట నిర్మాతల్లో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ ఏకిపారేస్తున్నారు. రిలీజ్‌కి నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఆశించిన మేర సర్కారు వారి పాట ప్రమోషన్స్ లేవని, వరుస అప్‌డేట్స్ కావాలనేది మహేష్ ఫ్యాన్స్ డిమాండ్. ఈ క్రమంలో అప్‌డేట్స్ సరిగా ఇవ్వడం లేదంటూ నిర్మాతలను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. #WorstTeamSVP అనే నెగెటివ్ ట్యాగ్ ను ఇండియా వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు. మ‌రి ఇది చూసైనా మేక‌ర్స్ అప్‌డేట్ ను విడుదల చేస్తారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now