Mahesh Babu : బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు పేర్కొన్న‌ మహేష్ బాబు.. స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాలతో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. పరుశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. నెక్ట్స్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఫ్లో లో టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేటెస్ట్ గా ఈ సినిమాని వచ్చే ఏడాది నుండి స్టార్ట్ చేస్తున్నారట.

ఈ విషయాన్ని మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఈ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సినిమా మల్టీ లాంగ్వేజ్ లో తెరకెక్కుతుందని అన్నారు. ఈ రకంగా మహేష్ బాబు బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు ఎప్పట్నుండో చూస్తున్నారు. ఆ కల ఇప్పుడు నిజమవుతుంది అన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్స్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక మహేష్ బాబు గానీ, రాజమౌళి గానీ అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. ఇప్పటివరకు మహేష్ సినీ కెరీర్ లో ఎన్నడూ చూడని విధంగా ఆయన స్టైల్, స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా అడవి నేపథ్యంలో అడ్వంచరస్ థ్రిల్లర్ కథతో స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. ఆ తర్వాత మరో లేటెస్ట్ జానర్ లో కూడా మహేష్ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మహేష్ తో రాజమౌళి పురాణేతిహాసాల నేపథ్యాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు గరుత్మంతుడి పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇందుకోసం మహేష్ తన లుక్ ని మార్చేయబోతున్నారట. ఇంకో వైపు అల్లు రామాయణంలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తారని అనుకున్నారు. ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా బాలీవుడ్ లోకి మహేష్ ఎంట్రీ ఇవ్వనున్నారనేది లేటెస్ట్ హాట్ న్యూస్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM