Thaman : త‌మ‌న్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న మ‌హేష్ బాబు, ర‌వితేజ ఫ్యాన్స్.. ఎందుకంటే..?

June 11, 2022 12:44 PM

Thaman : తెలుగు సినిమా ప్రేక్ష‌కులు మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎన్నో సినిమాల‌కు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. త‌క్కువ స‌మ‌యంలోనే త‌న మ్యూజిక్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని స్టార్ సంగీత ద‌ర్శ‌కుడిగా మారారు. దీంతో ఈయ‌న‌కు ఇప్పుడు ఆఫ‌ర్లు బాగానే వ‌స్తున్నాయి. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న చేసిన దాదాపు అనేక సినిమాలు హిట్ అయ్యాయి. అఖండ‌, స‌ర్కారు వారి పాట చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచాయి.

అయితే త‌మ‌న్ తాజాగా తాను చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల ఇబ్బందుల్లో ప‌డిపోయారు. ఆయ‌న‌పై మ‌హేష్ బాబు, ర‌వితేజ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక అందుకు కార‌ణం కూడా ఉంది. అదేమిటంటే.. ఆహా ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌సారం అవుతున్న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ షోకు త‌మ‌న్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఈ షోకు చెందిన మెగా ఫినాలె ప్రెస్‌మీట్‌ను ఇటీవ‌లే నిర్వ‌హించారు. ఇందులో త‌మ‌న్ మాట్లాడారు. త‌న సినిమా కెరీర్‌లో స‌రైనోడు, రేసు గుర్రం, అల వైకుంఠ‌పుర‌ములో.. చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అయ్యాయ‌ని తెలిపాడు. అయితే ఇదే విష‌యం మ‌హేష్, ర‌వితేజ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

Mahesh Babu and Ravi Teja fans angry on Thaman
Thaman

నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం ఉంటే ఆయ‌నను పొగుడు.. కానీ నీకు హిట్స్ వ‌చ్చింది ఆయ‌న చిత్రాలతోనే కాదు.. ఇత‌ర హీరోల చిత్రాల వ‌ల్ల కూడా నీకు హిట్స్ వ‌చ్చాయి. మ‌హేష్ బాబు బిజినెస్ మ్యాన్‌, దూకుడు, స‌ర్కారు వారి పాట హిట్ కాలేదా.. ర‌వితేజ కిక్ హిట్ కాలేదా.. దాంతోనే క‌దా నువ్వు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సెటిల్ అయ్యావు.. అలాంటిది ఆ హీరోల‌ను ఎలా మ‌రిచావు.. అంటూ ఆయా హీరోల‌కు చెందిన ఫ్యాన్స్.. త‌మ‌న్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఫ్యాన్స్ త‌మ‌న్‌ను విప‌రీతంగా ట్రోల్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు. అయితే దీనిపై త‌మ‌న్ స్పందించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now