Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కొత్త సినిమా లాంచింగ్‌.. క్రేజీ కాంబినేష‌న్‌..!

February 3, 2022 1:57 PM

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట మూవీని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డింది. ఇక ఈ సినిమాను మే 12వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో మ‌హేష్ కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. కాగా మ‌హేష్ చేయ‌బోయే త‌దుప‌రి చిత్రాన్ని గురువారం లాంచ్ చేశారు.

Mahesh Babu 28th movie launching
Mahesh Babu

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్‌ల కాంబినేష‌న్‌లో మ‌హేష్ త‌దుప‌రి చిత్రం గురువారం లాంచ్ అయింది. మ‌హేష్ బాబు 28వ సినిమాగా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అత‌డు, ఖ‌లేజా త‌రువాత త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ మ‌హేష్‌తో చేస్తున్న సినిమా ఇది. అయితే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ మ‌ధ్య కాలంలో చేసిన సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించాయి. దీంతో మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్‌ల కాంబినేష‌న్‌పై మ‌ళ్లీ భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఖ‌లేజా నిరాశ ప‌రిచినా.. ఈ సారి త్రివిక్ర‌మ్ మ‌హేష్‌ను కొత్త‌గా చూపించ‌నున్నార‌ని స‌మాచారం. దీంతో మ‌హేష్ బాబు 28వ చిత్రం హిట్ ప‌క్కా అని అంటున్నారు.

ఇక గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మానికి మ‌హేష్ హాజ‌రు కాలేదు. ఆయ‌న త‌న సినిమాల లాంచింగ్‌కు హాజ‌రు కారు. ఇది ఆయ‌న‌కు ఒక సెంటిమెంట్‌. అయితే ఈ మూవీ లాంచింగ్‌కు మ‌హేష్ భార్య న‌మ‌త్ర హాజ‌ర‌య్యారు. తొలి సీన్‌కు ఆమె క్లాప్ కొట్టారు. ఈ మూవీలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డె న‌టిస్తోంది. మ‌హేష్‌, పూజా క‌లిసి న‌టించిన మ‌హ‌ర్షి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. దీంతో వీరి కాంబినేష‌న్ మ‌రోమారు హిట్ అవుతుంద‌ని అంటున్నారు.

ఇక ఈ మూవీ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ మూవీని హారిక హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దీనికి థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now