Maha Shivaratri 2022 : మ‌హా శివ‌రాత్రి ఏ రోజు వ‌చ్చింది ? శుభ ముహుర్తం ఎప్పుడు ఉంది ?

February 25, 2022 10:47 AM

Maha Shivaratri 2022 : హిందువులు జ‌రుపుకునే అతి ముఖ్య‌మైన పండుగ‌ల్లో మ‌హా శివ‌రాత్రి ఒక‌టి. ఆ రోజు ప‌ర‌మ‌శివుడికి ఎంతో ప్రీతిక‌ర‌మైంది. ప్ర‌తి ఏడాది ఫ‌ల్గుణ మాసంలో కృష్ణ ప‌క్షం చ‌తుర్ద‌శి నాడు మ‌హా శివ‌రాత్రి వ‌స్తుంది. ఏడాదిలో 12 శివ‌రాత్రులు వ‌స్తాయి. కానీ ఈ స‌మ‌యంలో వచ్చే శివ‌రాత్రినే మ‌హా శివ‌రాత్రి అని పిలుస్తారు. ఇక ఈ సారి మార్చి 1వ తేదీన మ‌హా శివ‌రాత్రి పండుగ వ‌చ్చింది.

Maha Shivaratri 2022  date best timing shubha muhurtham
Maha Shivaratri 2022

మ‌హా శివ‌రాత్రిని ఈసారి మార్చి 1వ తేదీన జ‌రుపుకోనున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌హా శివ‌రాత్రి మార్చి 1వ తేదీన‌ తెల్ల‌వారుజామున 3:16 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మార్చి 2వ తేదీన అర్థ‌రాత్రి 1 గంట‌కు ముగియ‌నుంది. ఈ స‌మయాన్ని మ‌హాశివ‌రాత్రిగా ప‌రిగ‌ణిస్తారు.

భ‌క్తులు పూజ‌లు చేసేందుకు మార్చి 1వ తేదీ సాయంత్రం 6.21 గంట‌ల నుంచి మార్చి 2 తెల్ల‌వారుజామున ఉద‌యం 6.45 గంట‌ల వ‌ర‌కు అనుకూల స‌మ‌యం ఉంది. ఆ స‌మ‌యంలో శివుడికి అభిషేకాలు చేస్తే మంచిది. అలాగే ఆ స‌మ‌యంలో లింగోద్భ‌వం జ‌రుగుతుంది.. శివ‌పార్వతుల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.. క‌నుక ఆ స‌మ‌యాన్ని అన్ని విధాలుగా అనుకూలంగా చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment