Nagarjuna : తెలుగు బుల్లితెరపై కొనసాగుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగులో 5వ సీజన్ కొనసాగుతోంది. కాగా బిగ్ బాస్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ పై పలు రకాల సంఘాలు వ్యతిరేకతను చూపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ అనేది మన సంస్కృతి కాదని అంటారు. ఈ క్రమంలో బిగ్ బాస్ పై తెలుగు హీరోయిన్ మాధవీ లత లేటెస్ట్ గా రెస్పాండ్ అయ్యారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జునని కూడా టార్గెట్ చేసింది. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ ను దారుణంగా వేధిస్తున్నారని, మానసికంగా అతన్ని బలహీనం చేస్తున్నారని కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్ చల్ అవుతోంది.
ముఖ్యంగా బిగ్ బాస్ లో అనాగరిక చర్య జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ తోపాటు నాగార్జున కూడా ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంతగా అవమానిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల సంఘాలు ఎలాగో స్పందించవని అన్నారు.
ఇక మాధవీలత తన పోస్ట్ లో మెన్షన్ చేసిన కంటెస్టెంట్ ఎవరై ఉంటారనే కోణంలో నెటిజన్లు తెగ వెతికేసుకుంటున్నారు. నాగార్జున, బిగ్ బాస్ టీమ్ ఒక్కొక్క విషయంలో అందరినీ సమాన దృష్టితో చూస్తారు కదా అని, వారు ఎందుకు కంటెస్టెంట్స్ ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తిస్తారని.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు.
బిగ్ బాస్ పై గత కొంత కాలంగా ఎప్పుడూ ఏవో ఒక కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెర వర్గాల వారు కూడా స్పందిస్తూ.. బుల్లితెరపై వచ్చే ఏ ఒక్క ప్రోగ్రామ్ తోనూ నెగెటివ్ గా ప్రవర్తించరని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…