Nagarjuna : నాగార్జున‌పై మాధ‌వీల‌త సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. ఆ విధంగా చేస్తున్నారంటూ కామెంట్‌..

November 16, 2021 10:19 PM

Nagarjuna : తెలుగు బుల్లితెరపై కొన‌సాగుతున్న‌ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగులో 5వ సీజన్ కొనసాగుతోంది. కాగా బిగ్ బాస్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ పై పలు రకాల సంఘాలు వ్యతిరేకతను చూపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ అనేది మన సంస్కృతి కాదని అంటారు. ఈ క్రమంలో బిగ్ బాస్ పై తెలుగు హీరోయిన్ మాధవీ లత లేటెస్ట్ గా రెస్పాండ్ అయ్యారు.

madhavi latha sensational comments on Nagarjuna and bigg boss telugu

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జునని కూడా టార్గెట్ చేసింది. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ ను దారుణంగా వేధిస్తున్నారని, మానసికంగా అతన్ని బలహీనం చేస్తున్నారని కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో హల్ చల్ అవుతోంది.

ముఖ్యంగా బిగ్ బాస్ లో అనాగరిక చర్య జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ తోపాటు నాగార్జున కూడా ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంతగా అవమానిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల సంఘాలు ఎలాగో స్పందించవ‌ని అన్నారు.

ఇక మాధవీలత తన పోస్ట్ లో మెన్షన్ చేసిన కంటెస్టెంట్ ఎవరై ఉంటారనే కోణంలో నెటిజన్లు తెగ వెతికేసుకుంటున్నారు. నాగార్జున, బిగ్ బాస్ టీమ్ ఒక్కొక్క విషయంలో అంద‌రినీ సమాన దృష్టితో చూస్తారు కదా అని, వారు ఎందుకు కంటెస్టెంట్స్ ఆత్మహత్య చేసుకునేలా ప్ర‌వ‌ర్తిస్తార‌ని.. కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ పై గత కొంత కాలంగా ఎప్పుడూ ఏవో ఒక కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెర వర్గాల వారు కూడా స్పందిస్తూ.. బుల్లితెరపై వచ్చే ఏ ఒక్క ప్రోగ్రామ్ తోనూ నెగెటివ్ గా ప్రవర్తించరని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now