Maa : చీలిక దిశ‌గా మా అసోసియేష‌న్ ? మ‌రిన్ని రాజీనామాలు జ‌రిగే అవ‌కాశం ?

October 11, 2021 2:35 PM

Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఏమోగానీ.. ఈ అసోసియేష‌న్‌లో భారీగా కుదుపులు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా గెలుపొంద‌డంతో నాగ‌బాబు ముందుగా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మా స‌భ్యుల్లో ఉన్న సంకుచిత భావ‌న‌, లోక‌ల్, నాన్ లోక‌ల్ అనే ఫీలింగ్ వ‌ల్లే రాజీనామా చేస్తున్నానని ఆయ‌న తెలిపారు.

Maa movie artists association may divide into two groups

ఇక నాగ‌బాబు అనంత‌రం ప్ర‌కాష్ రాజ్ కూడా మా స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. త‌న‌ను నాన్ లోక‌ల్ అంటున్నార‌ని, క‌నుక అలాగే ఉండ‌ద‌లిచాన‌ని, అందువ‌ల్లే మా మెంబ‌ర్‌షిప్‌కు రాజీనామా చేస్తున్నాన‌ని.. అయితే తెలుగు సినిమాల్లో మాత్రం న‌టిస్తాన‌ని ఆయ‌న తెలిపారు. దీంతో మా లో ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌తోపాటు మెగా కుటుంబానికి చెందిన వారు విచారంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీలో నిల‌బ‌డి గెలిచిన శ్రీ‌కాంత్‌తోపాటు ఇత‌ర స‌భ్యులు కూడా రాజీనామా చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే నాగ‌బాబు, ప్ర‌కాష్ రాజ్ అండ్ కో. క‌లిసి ఓ కొత్త అసోసియేష‌న్‌ను పెడ‌తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఓడిపోయినంత మాత్రాన ఈ విధంగా అంద‌రూ వ‌రుస పెట్టి రాజీనామాలు చేస్తారా ? ఇండ‌స్ట్రీ పెద్ద‌లు చూస్తూ ఊరుకుంటారా ? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. మ‌రి మా భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now