MAA : మా అసోసియేషన్ లో ముదురుతున్న మరో వివాదం..?

November 26, 2021 8:37 PM

MAA : గత కొద్ది రోజుల క్రితం వరకు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా మా అసోసియేషన్ లో పెద్ద ఎత్తున విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే మంచు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఇక మా ఎన్నికలలో మంచు విష్ణు గెలవడంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మొత్తం రాజీనామా చేసి మంచు విష్ణుపై విమర్శలు కురిపించారు. కొన్ని రోజుల వరకు ఈ విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ ప్రశాంత వాతావరణం ఏర్పడింది.

MAA movie artists association in another controversy

అయితే తాజా పరిణామాలను చూస్తుంటే మరోసారి మా అసోసియేషన్ లో వివాదాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే కొత్త కార్యవర్గం వచ్చి నెల రోజులు అవుతున్నా ఇప్పటికీ మా అసోసియేషన్ ఆఫీస్ తాళాలు మూసి ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు వారికి పెన్షన్, వ్యక్తిగత సమస్యల గురించి మా అసోసియేషన్ అధికారులకు తెలియజేయాలని అసోసియేషన్ ఆఫీసు వద్దకు వెళ్లినప్పటికీ తాళాలు వేసి కనిపించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మామూలుగా అయితే మా అసోసియేషన్ లో అందరూ వచ్చే పని చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీటింగులకు మాత్రమే అందరూ హాజరైనా సరిపోతుంది, కానీ కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకు అసోసియేషన్ కార్యాలయం తాళాలు తెరవకపోవడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా మా అసోసియేషన్ గురించి వస్తున్న ఈ వార్తలపై పెద్ద ఎత్తున చర్చలు జరగడంతో మరోసారి వివాదం తలెత్తేలా ఉందని భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now