Maa Elections : ముగిసిన మా ఎన్నికల పోలింగ్‌.. చివరి నిమిషంలో ఓటు వేసిన అనసూయ

October 10, 2021 3:52 PM

Maa Elections : మా (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్) ఎన్నిక‌ల వార్ ముగిసింది. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మ‌ధ్య ఫైటింగ్ హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్న‌ట్టుగా ఒకరిపై ఒక‌రు మాట‌ల దాడులు చేసుకున్నారు. అయితే ఈ రోజు (ఆదివారం) ఉద‌యం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, కొద్ది సేప‌టి క్రితం ముగిసింది. చ‌రిత్ర‌లో ఎప్పుడు లేని విధంగా ఈ సారి పోలింగ్‌ సమయాన్ని గంట మేర పొడిగించారు. 2 గంట‌ల‌కు ముగియాల్సిన ఓటింగ్‌ని 3 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగించారు.

Maa Elections polling stopped anasuya cast vote in last minute

రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జ‌రిగిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఇంకొంద‌రు లైన్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే పోలింగ్ కేంద్రం గేట్స్ మూసి వేయ‌గా, లోప‌ల ఉన్న వారికి ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించారు. చివ‌రి నిమిషంలో వ‌చ్చిన అన‌సూయ ఓటు హ‌క్కు వినియోగించుకుంది. మొత్తం 72 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్టు తెలుస్తోంది. మొత్తం మా ఓట‌ర్స్ 905 కాగా, 665 మంది ఓటు వేసిన‌ట్టు స‌మాచారం. సాయంత్రం 5 గంటల‌కు కౌంటింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, రాత్రి 11 గంట‌లకు రిజ‌ల్ట్ రానుంది.

మ‌హేష్‌, ప్ర‌భాస్, రానా, అల్లు అర్జున్, ర‌కుల్, హ‌న్సిక‌, త్రిష‌, నాగ చైత‌న్య‌, స‌మంత‌, క‌ళ్యాణ్‌ రామ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. జెనీలియా స్పెష‌ల్‌గా ఓటింగ్ కోసం హైద‌రాబాద్ రావ‌డం విశేషం. పవన్ కళ్యాణ్ ‘మా’ ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now