Maa Elections : మా ఎన్నిక‌లు.. లైన్‌లో నిల‌బ‌డ్డ శివ బాలాజీ.. చేయి కొరికిన హేమ‌..

October 10, 2021 12:24 PM

Maa Elections : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు ఓ వైపు ప్ర‌శాంతంగా జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. కానీ లోప‌ల పోలింగ్ వ‌ద్ద మాత్రం ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఒక్క‌సారిగా తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో న‌టి హేమ శివ బాలాజీ చేయి కొరికింది. ఆ దృశ్యాల‌ను టీవీ చాన‌ళ్ల‌లో స్ప‌ష్టంగా చూపిస్తున్నారు కూడా. అయితే అక్క‌డ ఏం జ‌రిగింది ? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు.

Maa Elections actress hema bite shiva balaji hand

మ‌రోవైపు పోలింగ్ కేంద్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని, దాన్ని అడ్డుకునేందుకు హేమ ప్ర‌య‌త్నించింద‌ని, అందుక‌నే శివ బాలాజీ ఆపాడ‌ని, దీంతో ఆగ్ర‌హించిన హేమ అత‌ని చేయిని కొరికింద‌ని తెలుస్తోంది.

అయితే ఈ విష‌యంపై శివ‌బాలాజీ స్పందిస్తూ.. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని.. ముగిశాక అస‌లు ఏం జ‌రిగిందో చెబుతాన‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఎన్నిక‌లు చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now