Maa Elections 2021 : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించేందుకు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇంకో ప్యానెల్ నుంచి అధ్యక్ష పదవి బరిలో ఉన్న ప్రకాష్ రాజ్ కూడా గట్టిగానే క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే మంచు విష్ణు ఇప్పటికే కృష్ణ, బాలకృష్ణ, కృష్ణం రాజు వంటి సినీ ఇండస్ట్రీ పెద్దలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కానీ ప్రకాష్ రాజ్ ఆ ప్రయత్నం చేయలేదు.
తాజాగా నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. తనకు ఎవరి ఆశీర్వాదం అవసరం లేదని, ఇండస్ట్రీ పెద్దలను కలవబోవడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. కాగా ఆయన కలిసే ప్రయత్నం చేసినా అది వర్కవుట్ అవ్వలేదట. అందుకనే ఆయన ఇండస్ట్రీ పెద్దల గురించి ఆ విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ప్రకాష్ రాజ్ తన క్యాంపెయిన్‌లో తనకు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ ఉందని చెబుతూ వస్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరూ ఆయనతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. ఒక్క నాగబాబు మాత్రమే అందుకు ముందుకు వచ్చారు. ఆయన ఇప్పటికే తమ్ముడు పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేనలో నాయకుడిగా ఉన్నారు కనుక.. ఆ కోణంలో ఆయన అలా ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ ప్రకాష్ రాజ్‌తో కనిపించడం లేదు. దీంతో పలు సందేహాలు వస్తున్నాయి. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానెల్.. రెండు ప్యానెల్స్‌లో ఉన్న నటీనటులతో చిరంజీవికి, ఆయన కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఎన్నికల పేరిట ఆ బంధాన్ని తెంచుకోవద్దనే ఉద్దేశంతోనే చిరంజీవి తన కుటుంబ సభ్యులను ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని వారించినట్లు తెలుస్తోంది. అందుకనే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది.
అటు మోహన్ బాబుకు, ఇటు ప్రకాష్ రాజ్‌కు చిరంజీవి మిత్రులు. కనుకనే ఆయన ఎవరికీ ప్రచారం చేయవద్దని తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. అలా అని చెప్పి ఓటు వేయవద్దని కాదు, కానీ వారు ఎవరికి ఓటు వేస్తారో తెలియదు కదా. కానీ ప్రచారంలో పాల్గొంటే మాత్రం ఎవరో ఒకరి వైపు ఉండాలి కనుక అది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని మెగాస్టార్ భావించారట. అందుకనే ఆ కుటుంబం నుంచి ప్రచారంలో ఎవరూ పాల్గొనడం లేదని తెలుస్తోంది.
అయితే వారు కనిపించకపోవడంతో మెగా ఫ్యామిలీ ఈ విషయంలో చేతులెత్తేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ మెగాస్టార్ సపోర్ట్ మాత్రం ప్రకాష్ రాజ్‌కే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో చివరికి అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారనేది.. ఉత్కంఠగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…