గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Maa Elections 2021 : ‘మా’ ఎన్నిక‌ల విష‌యంలో మెగా ఫ్యామిలీ చేతులెత్తేసిందా ?

Maa Elections 2021 : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా విజ‌యం సాధించేందుకు మోహ‌న్ బాబు కుమారుడు మంచు విష్ణు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు ఇంకో ప్యానెల్ నుంచి అధ్య‌క్ష పదవి బరిలో ఉన్న ప్ర‌కాష్…

Maa Elections 2021 : ‘మా’ ఎన్నిక‌ల విష‌యంలో మెగా ఫ్యామిలీ చేతులెత్తేసిందా ?

Maa Elections 2021 : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా విజ‌యం సాధించేందుకు మోహ‌న్ బాబు కుమారుడు మంచు విష్ణు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు ఇంకో ప్యానెల్ నుంచి అధ్య‌క్ష పదవి బరిలో ఉన్న ప్ర‌కాష్ రాజ్ కూడా గ‌ట్టిగానే క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే మంచు విష్ణు ఇప్ప‌టికే కృష్ణ‌, బాల‌కృష్ణ‌, కృష్ణం రాజు వంటి సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను క‌లిసి ఆశీస్సులు తీసుకున్నారు. కానీ ప్ర‌కాష్ రాజ్ ఆ ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

Maa Elections 2021 mega family hands up over maa elections

తాజాగా నిర్వ‌హించిన ఓ మీడియా స‌మావేశంలో ప్ర‌కాష్ రాజ్ మాట్లాడుతూ.. త‌న‌కు ఎవ‌రి ఆశీర్వాదం అవ‌స‌రం లేద‌ని, ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను క‌ల‌వ‌బోవ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌న ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నార‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. కాగా ఆయ‌న క‌లిసే ప్ర‌య‌త్నం చేసినా అది వ‌ర్క‌వుట్ అవ్వ‌లేద‌ట‌. అందుక‌నే ఆయ‌న ఇండ‌స్ట్రీ పెద్ద‌ల గురించి ఆ విధంగా వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది.

Maa Elections 2021 : మెగాస్టార్ చిరంజీవి స‌పోర్ట్ ఉంద‌ని చెబుతూ..

ఇక ప్ర‌కాష్ రాజ్ త‌న క్యాంపెయిన్‌లో త‌న‌కు మెగాస్టార్ చిరంజీవి స‌పోర్ట్ ఉంద‌ని చెబుతూ వ‌స్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీకి చెందిన ఎవ‌రూ ఆయ‌న‌తో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌లేదు. ఒక్క నాగ‌బాబు మాత్ర‌మే అందుకు ముందుకు వచ్చారు. ఆయ‌న ఇప్ప‌టికే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెందిన జ‌నసేన‌లో నాయ‌కుడిగా ఉన్నారు కనుక‌.. ఆ కోణంలో ఆయ‌న అలా ప్ర‌కాష్ రాజ్‌కు స‌పోర్ట్ ఇస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

Maa Elections 2021 mega family hands up over maa elections

కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రూ ప్ర‌కాష్ రాజ్‌తో క‌నిపించ‌డం లేదు. దీంతో ప‌లు సందేహాలు వ‌స్తున్నాయి. మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు ప్యానెల్‌, ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్‌.. రెండు ప్యానెల్స్‌లో ఉన్న న‌టీన‌టుల‌తో చిరంజీవికి, ఆయ‌న కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఎన్నిక‌ల పేరిట ఆ బంధాన్ని తెంచుకోవ‌ద్ద‌నే ఉద్దేశంతోనే చిరంజీవి త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌వ‌ద్ద‌ని వారించిన‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రూ క‌నిపించ‌డం లేదని టాక్ వినిపిస్తోంది.

Maa Elections 2021 mega family hands up over maa elections

అటు మోహ‌న్ బాబుకు, ఇటు ప్ర‌కాష్ రాజ్‌కు చిరంజీవి మిత్రులు. క‌నుకనే ఆయ‌న ఎవ‌రికీ ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం. అలా అని చెప్పి ఓటు వేయ‌వ‌ద్ద‌ని కాదు, కానీ వారు ఎవ‌రికి ఓటు వేస్తారో తెలియ‌దు క‌దా. కానీ ప్ర‌చారంలో పాల్గొంటే మాత్రం ఎవ‌రో ఒక‌రి వైపు ఉండాలి క‌నుక అది త‌ప్పుడు సంకేతాలు ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని మెగాస్టార్ భావించార‌ట‌. అందుక‌నే ఆ కుటుంబం నుంచి ప్ర‌చారంలో ఎవ‌రూ పాల్గొన‌డం లేద‌ని తెలుస్తోంది.

అయితే వారు క‌నిపించక‌పోవ‌డంతో మెగా ఫ్యామిలీ ఈ విష‌యంలో చేతులెత్తేసింద‌ని కూడా వార్తలు వ‌స్తున్నాయి. కానీ మెగాస్టార్ స‌పోర్ట్ మాత్రం ప్ర‌కాష్ రాజ్‌కే ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో చివ‌రికి అధ్య‌క్షుడిగా ఎవ‌రు గెలుస్తార‌నేది.. ఉత్కంఠ‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి