NTR : ఎన్‌టీఆర్ ను టార్గెట్ చేసిన లోకేష్ ఫ్యాన్స్‌..? పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు..?

November 20, 2021 3:42 PM

NTR : ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు త‌న‌ను అవ‌మానించార‌ని.. త‌న భార్య‌పై దారుణంగా వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఆరోపిస్తూ.. టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు.. శుక్ర‌వారం ప్రెస్ మీట్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంపై రాజ‌కీయ పార్టీల నాయ‌కులు, సినీ సెల‌బ్రిటీలు భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు.

lokesh fans reportedly targeted NTR  for not supporting tdp

అసెంబ్లీలో తాను చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రిని ఒక్క‌మాట కూడా అన‌లేద‌ని మ‌రోవైపు అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌పై మాట‌ల దాడి చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండ‌గా.. చంద్ర‌బాబు ఏడ‌వ‌డం ఎన్‌టీఆర్‌కు మైన‌స్ అయింద‌ని అంటున్నారు.

టీడీపీలో రెండు వ‌ర్గాలు ఉన్నాయ‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ అసమ‌ర్థుడ‌ని, ఆయ‌న‌కు ఏమీ తెలియ‌ద‌ని.. క‌నుక పార్టీ ప‌గ్గాల‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అప్ప‌గించాల‌ని ఒక వ‌ర్గం ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌ను టార్గెట్‌గా చేసిన కొంద‌రు లోకేష్ ఫ్యాన్స్ ఎన్‌టీఆర్‌ను విమ‌ర్శిస్తున్నారు.

పార్టీ క‌ష్టాల్లో ఉన్నా, సాక్షాత్తూ పార్టీ అధినేత‌కు ఇంత‌టి అవ‌మానం జరిగి ఆయ‌న క‌న్నీళ్లు పెట్టుకున్నా.. ఎన్‌టీఆర్ ఎందుకు స్పందించ‌డం లేదు, పార్టీ అంటే ప‌ట్ట‌దా ? ఇలాంటి వారికి పార్టీ ప‌గ్గాలు ఎలా అప్ప‌గిస్తారు ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను లోకేష్ ఫ్యాన్స్ విమ‌ర్శిస్తున్నారు. ఇది ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు మింగుడు ప‌డ‌డం లేద‌ని అంటున్నారు.

ఎన్‌టీఆర్‌ను టార్గెట్ చేయ‌డం కోసమే ఈ విధంగా లోకేష్ ఫ్యాన్స్ విమ‌ర్శిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే గ‌తంలో వైఎస్ హ‌యాంలో టీడీపీ త‌ర‌ఫున ఎన్టీఆర్ ప్ర‌చారం చేశారు. త‌రువాత ఆయ‌న మ‌ళ్లీ రాజ‌కీయాల్లో క‌నిపించ‌లేదు. ఈ క్ర‌మంలోనే టీడీపీ ప‌గ్గాలు ఇప్ప‌టికైనా ఎన్‌టీఆర్ చేప‌ట్టాల‌ని.. లేదంటే పార్టీకి భ‌విష్య‌త్తు అనేది ఉండ‌ద‌ని.. టీడీపీలో చాలా మంది ఇప్ప‌టికే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది గిట్ట‌ని లోకేష్ అభిమానులు.. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌ను ఆస‌ర‌గా తీసుకుని ఈ విధంగా ఎన్‌టీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఎన్‌టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now