OTT : ఓటీటీలో ఈ వారం సంద‌డి చేయ‌నున్న సినిమాలేంటో తెలుసా ?

April 11, 2022 3:28 PM

OTT : థియేట‌ర్స్‌లో సినిమాలు న‌డుస్తున్నా కూడా ఓటీటీలో హంగామా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌తి వారం కొన్ని సినిమాలు ఓటీటీలో ర‌చ్చ చేస్తున్నాయి. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్, జీ5, ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రీమియర్ అవ‌నున్న సినిమాల‌ని ప‌రిశీలిస్తే.. శర్వానంద్, రష్మిక మందన్న నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం ప్రీమియ‌ర్ కానుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రమోట్ చేయబడినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను థియేటర్‌కి ర‌ప్పించ‌లేక‌పోయింది. ఈ చిత్రం ఇప్పుడు సోనీ లివ్‌లో ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

list of movies streaming on OTT platforms on April 14 and 15th 2022
OTT

ఇక దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ . కన్నడ ప్రేక్షకులు తమ అభిమాన సూపర్‌స్టార్‌లలో ఒకరైన పునీత్ ని ఎంత‌గానో అభిమానిస్తుంటారు. ఆయ‌న చివ‌రి చిత్రం జేమ్స్ కావ‌డంతో నివాళిగా ఈ సినిమాని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించేలా చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 15న సోనీ లివ్‌లో ప్రీమియ‌ర్ కానుంది. ఇక గాలివాన చిత్రం జీ 5 ఒరిజినల్ సిరీస్‌లో ఏప్రిల్ 14న ప్రీమియ‌ర్ కానుంది. సాయికుమార్, రాధికా శరత్‌కుమార్, చాందిని చౌదరి, ఇతరులతో సహా మంచి స్టార్ తారాగణం ఉంది.

ఇవే కాకుండా ది బ్లడీ మేరీ చిత్రం ఏప్రిల్ 15వ తేదీ నుండి ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రంలో నివేతా పేతురాజ్‌ కథానాయిక. అయితే ఈ చిత్రాల‌ల‌లో ఏ చిత్రానికి మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కుతుందో చూడాలి. అయితే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీలో ప్ర‌ముఖ‌ నటీనటులు ఉన్నప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఓటీటీలో ఎలాంటి ఫ‌లితం అందుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment