Liquor Sales : తెలంగాణ‌లో రికార్డు స్థాయిలో మ‌ద్యం అమ్మ‌కాలు.. మందు బాబులు ఎంత మ‌ద్యం తాగేశారంటే..?

January 1, 2022 1:52 PM

Liquor Sales : తెలంగాణ‌లో మ‌ద్యం అమ్మ‌కాలు రికార్డు స్థాయిలో కొన‌సాగుతున్నాయి. గ‌తేడాది కోవిడ్ ఆంక్ష‌ల కార‌ణంగా లిక్క‌ర్ సేల్స్ కొంత వ‌ర‌కు త‌గ్గాయి. అయితే ఈ ఏడాది మాత్రం పెద్ద‌గా ఆంక్ష‌లు లేక‌పోవ‌డంతో మ‌ద్యం అమ్మ‌కాలు భారీగానే జ‌రిగాయి. ఈ క్ర‌మంలో గ‌త 5 రోజుల్లో ఏకంగా రూ.902 కోట్ల విలువైన మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం విశేషం.

Liquor Sales in Telangana touched record high

డిసెంబ‌ర్‌లో తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా రూ.3,435 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. గతేడాది డిసెంబ‌ర్‌లో రూ.2764 కోట్ల మ‌ద్యం అమ్ముడ‌వ‌గా.. ఈసారి అంత‌క‌న్నా ఎక్కువ‌గానే మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌డం విశేషం.

ఇక డిసెంబ‌ర్ 27న రాష్ట్ర వ్యాప్తంగా రూ.202.42 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ్గా, 28వ తేదీన రూ.155.48 కోట్లు, 29న రూ.149.53 కోట్లు, 30న రూ.246.56 కోట్లు, 31వ తేదీ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు రూ.148.52 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం అర్థ‌రాత్రి 1 గంట వ‌ర‌కు వైన్ షాపులు, బార్ల‌ను తెరిచేందుకు అనుమ‌తులు ఇవ్వడంతో ఈ సేల్స్ ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది.

కాగా రాష్ట్రంలో గ‌తేడాది రూ.25,601.39 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌గా ఈ ఏడాది శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు రూ.30,196 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగాయి. ఈ లెక్క‌లు ఇంకా పెర‌గ‌నున్నాయి. ఈసారి మొత్తం 3,68,68,975 కేసుల మ‌ద్యం అమ్ముడ‌వ‌గా, 3,25,82,859 కేసుల బీర్ అమ్ముడైంది. కేవ‌లం రంగారెడ్డి జిల్లాలోనే మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా రూ.6,979 కోట్ల ఆదాయం రాగా, రూ.3,288 కోట్ల‌తో న‌ల్గొండ రెండో స్థానంలో నిలిచింది. త‌రువాత రూ.3,201 కోట్ల‌తో హైద‌రాబాద్ మూడో స్థానంలో నిలిచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now