Liger Movie : ఓటీటీలో లైగ‌ర్ మూవీ.. ఎందులో అంటే..?

August 25, 2022 8:32 PM

Liger Movie : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన‌ చిత్రం లైగర్. ఇందులో రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ప్రధాన పాత్రాల్లో నటించారు. మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ మూవీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించ‌గా.. ఛార్మి, దర్శకుడు పూరీ, బాలీవుడ్ ప్రొడ్యుసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌లైంది.

అయితే ఈ చిత్రం ఓటీటీ హక్కుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఛార్మి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో జేబులో ఒక్క రూపాయి లేనప్పుడు ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. అంత పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలి అంటూ ఛార్మి భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే..

Liger Movie will be streaming on OTT
Liger Movie

అయితే ప్రస్తుతం లైగర్ ఓటీటీ రైట్స్ ని డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్ కొనుగోలు చేసినట్టు రివీల్ అయింది. ఈ మూవీ రిలీజ్ అవ్వడంతో వెండితెరపై అది కన్ఫర్మ్ అయింది. విజయ్ – పూరీ కాంబో కావడంతో లైగర్ ఓటీటీ హక్కుల కోసం డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్ భారీ మొత్తాన్ని చెల్లించినట్టు సమాచారం. అయితే ఈ చిత్రం కొత్త ఓటీటీ నిబంధనల ప్రకారం 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. అంటే.. అక్టోబర్ లో సినిమా వచ్చే అవకాశం ఉంది. థియేటర్ లో మిక్స్డ్ టాక్ తో ఈ మూవీ దూసుకుపోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now