Liger Movie : ట్రైల‌ర్ కే ఇంత రచ్చ ఏంటి సామీ.. రేపు సినిమా రిలీజ్ అయితే ఏం చేస్తారో..?

July 20, 2022 5:32 PM

Liger Movie : డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం.. లైగ‌ర్‌. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించింది. అలాగే ఇందులో అంత‌ర్జాతీయ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టించారు. దీంతో సినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ మూవీని పూరీ క‌నెక్ట్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. ఆగస్టు 25న ఈ మూవీ రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టింది.

లైగ‌ర్ మూవీకి గాను ఈ మ‌ధ్యే విజ‌య్‌కు చెందిన న‌గ్న ఫొటోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అందులో విజ‌య్ త‌న కింది భాగంలో పూలు పెట్టుకుని క‌నిపించాడు. ఈ క్ర‌మంలోనే విజ‌య్‌కి చెందిన ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది. చాలా మంది ఈ ఫొటోపై మీమ్స్ చేశారు. విజ‌య్‌కి కింది భాగంలో చెడ్డీ పెట్టిన‌ట్లు కొంద‌రు మార్ఫింగ్ చేయ‌గా.. బాల‌కృష్ణ శాలువా క‌ప్పుతున్న‌ట్లుగా కొంద‌రు మార్ఫింగ్ చేశారు. ఈ క్ర‌మంలోనే విజ‌య్‌కి చెందిన ఆ పిక్ ద్వారా సినిమాకు కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ ల‌భించింది.

Liger Movie Vijay cutout photo viral
Liger Movie

ఇక ఈ మ‌ధ్యే లైగ‌ర్ స్టోరీ కూడా ఆన్‌లైన్‌లో లీకైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. మైక్ టైస‌న్‌తో సెల్ఫీ తీసుకోవాల‌నే క‌ల‌తో చివ‌ర‌కు అత‌న్నే అంత‌మొందించి అత‌న్ని ఒడిలో ప‌డుకోబెట్టుకుని లైగ‌ర్ అత‌నితో సెల్ఫీ తీసుకుంటాడు.. అన్న క‌థ‌ను బాగా ప్ర‌చారం చేశారు. అయితే దీన్ని చిత్ర యూనిట్ ఖండించ‌లేదు. ఇక తాజాగా విజ‌య్‌కి చెందిన క‌టౌట్స్ ప‌లు చోట్ల ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో అస‌లు విష‌యం ఏమిటా.. అని నెటిజ‌న్లు ఆరా తీస్తున్నారు.

జూలై 21, 2022 గురువారం లైగ‌ర్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు చోట్ల విజ‌య్ లైగ‌ర్ పిక్‌ను క‌టౌట్‌గా పెట్టారు. కేవ‌లం ట్రైల‌ర్ కే ఇంత‌లా రెస్పాన్స్ వ‌స్తుంటే ఇక రేపు సినిమా రిలీజ్ అయితే ఏ మేర స్పంద‌న వ‌స్తుందో ఇట్టే ఊహించుకోవ‌చ్చు. దీంతో విజ‌య్ స్టార్ హీరో అయిపోయిన‌ట్లే అని అంటున్నారు. ఇక ట్రైల‌ర్ ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now