Liger Movie : ఓటీటీకి అమ్మినా పోయేదిగా.. రూ.200 కోట్లు గోవిందా..!

August 28, 2022 7:23 PM

Liger Movie : విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఆగస్ట్ 25న థియేటర్లలోకి రావడం.. వచ్చిన రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం జరిగిపోయాయి. అయితే సినిమా విడుదలకు ముందు.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఛార్మీ కౌర్.. ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. విజయ్, పూరీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమా నిర్మాణ సమయంలో మా దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. ఒక్క రూపాయి కూడా లేదు. ఆ సమయంలో మాకు ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చింది. కానీ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆ డీల్‌ని కాదనుకున్నాం.

అందుకు పూరీ గారికి ఎన్ని గ‌ట్స్ కావాలి అంటూ చార్మీ విషయాన్ని రివీల్ చేసింది. ఈ విషయం చెబుతూ ఆమె కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఇప్పుడిదే విషయాన్ని హైలెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీమర్స్ మాత్రం మీమ్స్ తో తెగ సందడి చేస్తున్నారు. ఇంత గొప్ప సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందో ? అంటూ ఛార్మిని, పూరీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Liger Movie team missed rs 200 crore deal
Liger Movie

ఇప్పుడున్న టాక్ ప్రకారం ఈ సినిమా రూ.50 కోట్లు వసూలు చేయడం కూడా కష్టమే. మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో ఓటీటీ డీల్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా సినిమాపై ఉన్న నమ్మకంతో పూరి, ఛార్మీ అండ్ టీమ్ చేజేతులా రూ. 200 కోట్లు మిస్ చేసుకున్నారు. ఇక విజయ్‌ అయితే సినిమా వసూళ్లు రూ.200 కోట్ల నుండి లెక్కెడతా అని సినిమాకు ఓవర్‌ హైప్‌ ఇచ్చాడు. అంటే రూ.200 కోట్లకుపైగా సినిమా వసూళ్లు ఉంటాయి అని చెప్పాడు. దీంతో ఇప్పుడు ఎక్కడి నుంచి లెక్కపెడతారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now