Liger Movie : లైగ‌ర్ మూవీ 5 రోజుల‌కు గాను వ‌చ్చిన వ‌సూళ్లు ఇవే.. ఇంకా ఎంత రావాలంటే..?

August 31, 2022 8:22 AM

Liger Movie : లైగ‌ర్ సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింద‌నే చెప్ప‌వ‌చ్చు. దాదాపుగా రూ.120 కోట్లకు పైగానే బ‌డ్జెట్ తో రూపొందిన ఈ సినిమా నిర్మాత‌లు భారీ న‌ష్టాల‌ను చూసేలా చేసింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ పాత్ర‌ను కూడా న‌వ్వుల పాలు చేశార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పూరీ జ‌గ‌న్నాథ్ ఇంకా ఛార్మీల‌ నిర్మాణ భాగ‌స్వామ్యంలో క‌ర‌ణ్ జోహార్ స‌హ‌కారంతో బాలీవుడ్ లో కూడా ఆగ‌స్టు 25న‌ విడుద‌లైన సినిమా లైగ‌ర్. రిలీజైన రోజు రెండ‌వ ఆట నుండే క‌లెక్షన్లు దారుణంగా ప‌డిపోయాయి.

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా 5 రోజుల‌ వ‌సూళ్ల ప‌రంగా చూసుకున్న‌ట్ల‌యితే, కేవ‌లం రూ.25.14 కోట్ల షేర్ ను మాత్ర‌మే సాధించిందని తెలుస్తోంది. ఇక వివిధ ప్రాంతాల ప‌రంగా ప‌రిశీలించిన‌ట్ల‌యితే, ఈ చిత్రం నైజాంలో రూ.5.62 కోట్లు, సీడెడ్ రూ.1.83 కోట్లు, ఆంధ్రలో రూ.5.36 కోట్లు, మొత్తం మీద ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంకా తెలంగాణ లో క‌లిపి రూ.12.81 కోట్ల షేర్ అలాగే రూ.21.80 కోట్ల గ్రాస్ ను వ‌సూలు చేసింది.

Liger Movie 5 days collections how much it has to be collected
Liger Movie

ఇక ఇండియాలో హిందీ ఇంకా ఇత‌ర భాష‌ల‌లో క‌లిపి చూసుకున్న‌ట్ల‌యితే ఈ సినిమా రూ.8.99 కోట్లు, అలాగే ఇత‌ర దేశాల‌లో రూ.3.34 కోట్ల వ‌సూళ్లు సాధించింది. ఇక 5 రోజులలో ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.25.14 కోట్ల షేర్ అలాగే రూ.52.40 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను చేరుకుంది. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమా నిర్మాత‌ల‌కి ఇంకా రూ.60 నుండి రూ.70 కోట్ల న‌ష్టాల‌ను మిగిలిస్తుంద‌ని భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now