Lenovo Tab M10 Plus : 10.61 ఇంచుల డిస్‌ప్లే, భారీ బ్యాట‌రీతో.. లెనోవో కొత్త ట్యాబ్.. ధ‌ర ఎంతంటే..?

September 30, 2022 1:08 PM

Lenovo Tab M10 Plus : కంప్యూట‌ర్స్ త‌యారీదారు లెనోవో మార్కెట్‌లోకి ట్యాబ్ ల‌ను తెచ్చి చాలా కాల‌మే అయింది. అప్ప‌ట్లో ఈ కంపెనీ రిలీజ్ చేసిన ట్యాబ్ ల‌కు అంత‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. కానీ ఇప్పుడు మాత్రం ట్యాబ్‌ల‌ను బాగానే కొనుగోలు చేస్తున్నారు. క‌నుక అధునాత‌న ఫీచ‌ర్ల‌తో లెనోవో మ‌ళ్లీ ట్యాబ్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ట్యాబ్ ఎం10 ప్ల‌స్ పేరిట 3వ జ‌న‌రేష‌న్ ట్యాబ్‌ను భార‌త్‌లో లేటెస్ట్‌గా విడుద‌ల చేసింది. దీంట్లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా బ‌డ్జెట్‌లోనే ఉండ‌డం విశేషం. ఇక ఇందులో ఉన్న ఫీచ‌ర్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

లెనోవో ట్యాబ్ 10 ప్ల‌స్ 3వ జ‌న‌రేష‌న్ ట్యాబ్‌లో 10.61 ఇంచుల 2కె డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 2000 x 1200 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. స్నాప్‌డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్ ల‌భిస్తాయి. సింగిల్ మైక్రోఫోన్ ఉంది. డాల్బీ అట్మోస్‌తో క్వాడ్ స్పీక‌ర్ల‌ను అందిస్తున్నారు. క‌నుక సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఈ ట్యాబ్ లో ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను పొంద‌వ‌చ్చు. వెనుక వైపు 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉండ‌గా.. ముందు వైపు కూడా ఇంకో 8 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

Lenovo Tab M10 Plus latest android tablet launched
Lenovo Tab M10 Plus

ఈ ట్యాబ్‌లో చిన్నారుల కోసం గూగుల్ కిడ్స్ స్పేస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అలాగే దీంతో లెనోవో ప్రిసిష‌న్ పెన్ 2ను పొంద‌వ‌చ్చు. దీనికి అద‌నంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్ లో 7700 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉండ‌గా.. ఇది 12 గంట‌ల వ‌ర‌కు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఈ ట్యాబ్ లో 1టీబీ వ‌ర‌కు సైజ్ ఉన్న మైక్రో ఎస్‌డీ కార్డ్‌ను వేసి ఉప‌యోగించ‌వ‌చ్చు. అలాగే 3.5ఎంఎం ఆడియో జాక్‌, ఎఫ్ఎం రేడియో, ఆప్ష‌న‌ల్ 4జి ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, వైఫై డైరెక్ట్‌, వైఫై డిస్‌ప్లే.. వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఇందులో అందిస్తున్నారు.

లెనోవో ట్యాబ్ ఎం10 ప్ల‌స్ 3వ జ‌న‌రేష‌న్ ట్యాబ్ స్టార్మ్ గ్రే, ఫ్రాస్ట్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో విడుద‌ల కాగా.. ఈ ట్యాబ్ కు చెందిన వైఫై మోడ‌ల్ ధ‌ర రూ.19,999గా ఉంది. అలాగే ఎల్‌టీఈ వేరియెంట్ మోడ‌ల్ ధ‌ర రూ.21,999గా ఉంది. త్వ‌ర‌లో ఈ ట్యాబ్‌ను అమెజాన్‌తోపాటు లెనోవో ఆన్‌లైన్ స్టోర్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now