Lemon : ఫోన్ కొంటే పెట్రోల్‌.. యాక్స‌స‌రీలు కొంటే నిమ్మ‌కాయ‌లు ఫ్రీ.. ఎక్క‌డంటే..?

April 21, 2022 3:29 PM

Lemon : ప్ర‌స్తుత త‌రుణంలో రోజు రోజుకీ పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఏవిధంగా పెరిగిపోతున్నాయో అంద‌రికీ తెలిసిందే. సామాన్యుల‌కు ఇంధ‌న ధ‌ర‌లు చుక్క‌ల‌ను చూపిస్తున్నాయి. దీంతో జేబుకు భారీగా చిల్లు ప‌డుతోంది. అలాగే నిమ్మ‌కాయ‌ల ధ‌ర‌లు కూడా మండిపోతున్నాయి. నిమ్మ‌కాయ‌లు గతంలో ఎన్న‌డూ లేనివిధంగా ధ‌ర ప‌లుకుతున్నాయి. దీంతో నిమ్మ‌కాయ‌కు ఈ వేస‌విలో చాలా మంది ఇప్ప‌టికే దూరం అయ్యారు. అయితే ఇదే విష‌యాన్ని అదునుగా చూసుకున్న ఆ మొబైల్ స్టోర్స్ య‌జ‌మాని మాత్రం త‌మ సేల్స్‌ను పెంచుకునేందుకు వినూత్న‌మైన ఆలోచ‌న చేశాడు. అదేమిటంటే..

Lemon are free if you buy mobile accessories know where
Lemon

వార‌ణాసిలోని మొబి వ‌ర‌ల్డ్ షాప్ వేస‌వి ఆఫర్ల‌ను ప్ర‌క‌టించింది. త‌మ సేల్స్‌ను పెంచుకునేందుకు వారు వినూత్న‌మైన ఆలోచ‌న చేసి దాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నారు. త‌మ వ‌ద్ద రూ.10 వేలు.. అంత‌క‌న్నా ఎక్కువ ధ‌ర క‌లిగిన ఫోన్‌ను కొంటే లీట‌ర్ పెట్రోల్‌ను ఉచితంగా అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అలాగే మొబైల్ ఫోన్ల‌కు సంబంధించిన యాక్స‌స‌రీల‌ను కొనుగోలు చేస్తే 1 నుంచి 5 వ‌ర‌కు నిమ్మ‌కాయ‌ల‌ను కూడా ఉచితంగా అందిస్తున్నామ‌ని తెలియ‌జేసింది.

అలా ఆ షాప్ వారు ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించడంతో జ‌నాలు అక్క‌డ గుమిగూడుతున్నారు. త‌మ‌కు ఇప్పుడు ర‌ద్దీ ఎక్కువైంద‌ని ఆ షాప్ వారు తెలియ‌జేశారు. ఏది ఏమైనా రోజురోజుకీ పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌ల‌తోపాటు నిమ్మ‌కాయ‌ల ధ‌ర‌ల‌ను కూడా ఆస‌రాగా చేసుకుని వారు ఇలా ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించ‌డంతో పెద్ద ఎత్తున వినియోగ‌దారులు ఆ షాప్‌కు వెళ్లి ఫోన్లు, యాక్స‌స‌రీల‌ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆ షాప్ వారు త‌మ ఐడియా ప‌నిచేసినందుకు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment