Lavanya Tripathi : లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్ ల పెళ్లి.. అస‌లు విష‌యం ఇదీ..!

Lavanya Tripathi : సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో అనేక వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. వాటిల్లో సెల‌బ్రిటీల‌కు చెందిన‌వే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే గ‌తంలో సమంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్త‌లు రాగా అవి త‌రువాత నిజ‌మ‌య్యాయి. ఇక న‌రేష్, ప‌విత్ర లోకేష్‌లు స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని, త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే స‌హ‌జీవ‌నం చేస్తున్న‌మాట నిజ‌మే అయ్యింది కానీ పెళ్లి వార్త‌పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇలా సెలబ్రిటీల‌కు సంబంధించి అనేక వార్త‌లు ముందుగానే వైర‌ల్ అవుతున్నాయి. కానీ అవే త‌రువాత నిజం అవుతుండ‌డం విశేషం. ఇక ఇలాంటి వార్తే గ‌తంలో బాగా వైర‌ల్ అయింది. అదేమిటంటే..

అప్ప‌ట్లో మెగా హీరో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిలు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని.. లావ‌ణ్య‌కు వ‌రుణ్ డైమండ్ రింగ్‌ను ఇచ్చి ప్ర‌పోజ్ చేశాడని.. ఇందుకు లావ‌ణ్య కూడా ఓకే చెప్పింద‌ని.. నాగ‌బాబు కూడా అడ్డు చెప్ప‌లేద‌ని.. క‌నుక వీరి పెళ్లి ఖాయ‌మైపోయిందంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాటిపై లావ‌ణ్య లేదా వ‌రుణ్, నాగబాబు ఎవ‌రూ స్పందించ‌లేదు. ఆ వార్త‌ల‌ను ఖండించ‌లేదు. దీంతో ఆ వార్త‌ల‌ను నిజ‌మే అని న‌మ్మారు. కానీ ఆ రూమ‌ర్స్‌కు లావ‌ణ్య తాజాగా చెక్ పెట్టింది. త‌న‌కు, వ‌రుణ్‌కు పెళ్లి అంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై ఆమె స్పందించింది. ఇంత‌కీ ఆమె చెప్పిందంటే..

Lavanya Tripathi

త‌న‌కు, వ‌రుణ్‌కు పెళ్లి అన్న‌వార్త‌ల‌పై తాను నిజంగా షాక్‌కు గుర‌య్యాన‌ని లావ‌ణ్య త్రిపాఠి తెలియ‌జేసింది. పొద్దున పెళ్లి, సాయంత్రం రిసెప్ష‌న్.. ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది.. అంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై తాను నిజంగానే ఆశ్చ‌ర్య‌పోయాన‌ని ఆమె చెప్పింది. తాను, నిహారిక మంచి ఫ్రెండ్స్ అని.. అంత‌కు మించి త‌న‌కు, వ‌రుణ్‌కు మ‌ధ్య ఏమీ లేద‌ని క్లారిటీ ఇచ్చేసింది. ఇక త‌న వేలికి ఉన్న రింగ్‌ను తానే కొనుక్కున్నాన‌ని.. అది వ‌రుణ్ ఇచ్చింది కాద‌ని కూడా చెప్పింది. దీంతో వీరి పెళ్లి రూమ‌ర్స్‌కు తెర ప‌డిన‌ట్లు అయింది.

ఇక లావ‌ణ్య త్రిపాఠి లేటెస్ట్‌గా న‌టించిన హ్యాపీ బ‌ర్త్ డే మూవీ ఈ నెల 8వ తేదీన రిలీజ్ కానుండ‌గా.. లావ‌ణ్య ప్ర‌స్తుతం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పై విధంగా త‌న పెళ్లి గురించి వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించి రిప్లై ఇచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM