Lal Singh Chaddha : అమీర్‌ఖాన్‌కు దిమ్మ తిరిగిపోయే షాక్‌.. లాల్ సింగ్ చ‌డ్డా హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్ లీక్‌..

Lal Singh Chaddha : ఒక సినిమా తీయడానికి కొన్ని వందల మంది కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో రోజులు శ్రమిస్తారు. కానీ కొంతమంది అత్యుత్సాహం వల్ల వారి కష్టం అంతా వృథాగా పోయి వారికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. అమీర్ ఖాన్ హీరోగా, కరీనా కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా తాజాగా విడుదలైంది. ఈ సినిమాను అమెరికాలో సూపర్ హిట్ గా నిలిచిన ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి రీమేక్‌గా తెర‌కెక్కించారు. ఫారెస్ట్ గంప్‌కి అనేక ఆస్కార్ అవార్డులు రావడంతో ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

దానికి తగినట్లుగా అదే సినిమాని లాల్ సింగ్ చ‌డ్డాగా తెర‌కెక్కించారు. ఇక‌ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండడంతో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసింది. అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. లాల్ సింగ్ చడ్డా విడుదలైన మొదటి రోజునే హెచ్‌డీ క్వాలిటీతో తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్‌ వంటి సైట్ల‌లో లీక్ కావడంతో మూవీ మేకర్స్ ని, నటీనటులను షాక్‌కు గురి చేసింది.

Lal Singh Chaddha

లాల్ సింగ్ చడ్డాను తమిళ రాకర్స్, టెలిగ్రామ్, మూవీ రూల్జ్‌ తో సహా ఇతర పైరసీ ఆధారిత వెబ్‌సైట్‌లలో లీక్ చేశారు. దురదృష్టవశాత్తూ సినిమా లీక్ కావడంతో బాక్సాఫీస్ కలెక్షన్‌ పై ప్రభావం పడవచ్చు. అయితే.. సినిమా విడుదలైన మొదటి రోజు లీక్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు సీతారామం, బింబిసార, శభాష్ మిథు, షంషేరా, విక్రాంత్ రోనా, మేజర్, ఎఫ్ 3, స్ట్రేంజర్ థింగ్స్ 4, ఆచార్య, రాధేశ్యామ్, బంగార్రాజు, ధాకడ్, భూల్ 2 రూపాయ్ వంటి అనేక చిత్రాలు ఆయా సైట్లలో తొలి రోజే లీక‌య్యాయి.

ఇక ఈ టాప్ పైరసీ సైట్లపై ప్రభుత్వం అనేక సార్లు కఠిన చర్యలు తీసుకుంది. గతంలో అనేక సార్లు తమిళ్ రాకర్స్ సైట్ ను బ్లాక్ చేశారు. అయిన‌ప్ప‌టికీ ప్రతిసారి వారు కొత్త డొమైన్‌ తో వస్తున్నారు. తమిళరాకర్స్ సైట్‌ థియేటర్లలో విడుదలైన సినిమాలను లీక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పైరసీ అనేది 1957 కాపీరైట్ చట్టం ప్రకారం నేరం. ఏ రూపంలోనైనా పైరసీలో పాల్గొనడం లేదా ప్రోత్సహించడం మానుకోవాల‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM