Kuppinta Mokka : ర‌హ‌దారుల ప‌క్క‌న కనిపించే మొక్క ఇది.. పిచ్చి మొక్క అని అనుకోకండి.. లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

November 29, 2022 1:18 PM

Kuppinta Mokka : ప్రకృతి ప్రసాదించిన మొక్కలు మన చుట్టూ ఉన్న కూడా ఆ మొక్కల్లో చాలా వాటిని పిచ్చి మొక్కలు అనుకుని పట్టించుకోము. కానీ పల్లెటూర్లలో, పొలాల గట్ల మీద పెరిగే కొన్ని రకాల మొక్కలను పిచ్చి మొక్కలు అని పీకేసి పక్కన పడేస్తూ ఉంటాం. కానీ ఎందుకు పనికిరావు అనుకునే ఆ మొక్కల్లోనే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలా పొలం గట్లమీద, ఇంటి ఆవరణలో, ఖాళీ ప్రదేశాలలో పెరిగే ఓ మొక్క మురిపిండి ఆకు మొక్క. ఈ మొక్కను దాదాపుగా అందరు చూసే ఉంటారు.

మురిపిండి ఒక రకమైన ఔషధ మొక్క. మురిపిండిని మగబీర, కుప్పింట, హరిత మంజరి అని కూడా అంటారు. ఎకలైఫా ఇండిక జాతికి చెందిన మొక్క ఇది. పిచ్చి మొక్కగా భావించి ఈ మొక్కలో ఉండే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో వయసుతో తేడా లేకుండా ఆడ మగ ప్రతి వారు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. కీళ్ల నొప్పులు వచ్చాయి అంటే ఒక విధంగా వారి బాధ నరకప్రాయం అని చెప్పుకోవాలి. అలాంటి వారి కోసం ఈ మురిపిండి ఆకు మొక్క నొప్పులు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

Kuppinta Mokka wonderful health benefits
Kuppinta Mokka

మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు అనేవి మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నొప్పులు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు మరియు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన పెద్దగా ప్రయోజనం ఉండదు. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వస్తే ఈ రోజుల్లో మనం ఏమి ఆలోచించకుండా ఆస్పత్రులకు వెళ్తున్నాం. కానీ మన పూర్వీకులు మాత్రం నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఈ మురిపిండి మొక్కను వాడేవారు.

కీళ్ల నొప్పులు తగ్గించడానికి మురిపిండి ఆకుతో ఏ విధంగా ఔషధాన్ని తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా ఈ మురిపిండి మొక్క ఆకులు తెచ్చుకొని బాగా ఎండబెట్టాలి. ఆ తర్వాత దానిని పొడి లాగా తయారు చేసుకోవాలి. ఆ పొడిని ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని ఆర గ్లాస్ అయ్యేవరకు బాగా మరిగించాలి. తరువాత ఆ నీటిని వడగట్టి అందులో నాలుగు స్పూన్ల అల్లం రసం కలుపుకొని దానిని రోజూ సేవిస్తూ ఉండాలి. ఇలా రోజూ తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గుముఖం పడతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now