Kriti Sanon : హీరోయిన్లు అంటే అందరికీ చులకనే.. కృతిసనన్ వ్యాఖ్యలపై దుమారం..

March 19, 2022 7:58 AM

Kriti Sanon : అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది నటి కృతి సనన్. తెలుగులో మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లింది. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న కృతి సనన్ అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన బచ్చన్‌ పాండే మూవీ ఈనెల 18వ తేదీన విడుదలైంది.

Kriti Sanon sensational comments on heroes
Kriti Sanon

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హీరోలకు సమానంగా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత లేదని తెలియజేసింది. హీరోయిన్లకు 60 శాతం ప్రాధాన్యత ఉండి హీరోలకు 40 శాతం ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడానికి హీరోలు ఆసక్తి చూపడం లేదని తెలిపింది.

ఇలాంటి వ్యత్యాసం కారణంగానే గతంలో తాను నటించిన సినిమాలలో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపలేదని ఈమె వెల్లడించింది. ఇండస్ట్రీలో ఇలాంటి ధోరణి మారాలని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కృతిసనన్ తెలియజేసింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన ఆది పురుష్ చిత్రం ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now