Krithi Shetty : హ‌ల‌మితి హ‌బిబో పాటకు అద్భుతమైన స్టెప్పులు వేస్తూ రచ్చ చేసిన బేబమ్మ!

March 28, 2022 12:55 PM

Krithi Shetty : మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ సరసన బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో బేబమ్మకు మంచి అవకాశాలు వస్తున్నాయి.

Krithi Shetty danced for arabic kuthu song video viral
Krithi Shetty

ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న‌ కృతి శెట్టి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తాజాగా ఈమె ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఆ వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ చిత్రంలోని పాటకు బేబమ్మ డాన్స్ చేసింది.

విజయ్ నటించిన బీస్ట్ చిత్రంలోని అనిరుధ్ ర‌విచంద‌ర్ కంపోజ్ చేసిన హ‌ల‌మితి హ‌బిబో సాంగ్ ఎంత పాపులారిటీని దక్కించుకుందో మనకు తెలిసిందే. ఈ పాటకు ఎంతో మంది రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ పాటకు బేబమ్మ కూడా కాలు కదిపింది. చిలక పచ్చ చీర, స్లీవ్ లెస్ ధరించిన కృతి.. హ‌ల‌మితి హ‌బిబో పాటకు డాన్స్ చేస్తూ అభిమానులను సందడి చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now