Krithi Shetty : కృతి శెట్టిది ఎంత సున్నితమైన మనసు అంటే.. వారు అలా చేయగానే ఏడ్చేసింది.. వీడియో వైరల్‌..!

May 29, 2022 9:53 PM

Krithi Shetty : ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. కృతి శెట్టి. ఈ అమ్మడు తొలి సినిమానే హిట్‌ కావడంతో ఇక వెనుకకు తిరిగి చూడలేదు. ఆఫర్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈమె బంగార్రాజు మూవీలో నటించి అలరించింది. నటనలోనూ తనకంటూ ఈమె ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈమె రామ్‌ పక్కన ది వారియర్‌ అనే మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూలై 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక కృతి శెట్టి సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే పలు కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది.

కాగా కృతి శెట్టి ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌ కార్యక్రమానికి హాజరైంది. అయితే ఆమెతో నిర్వాహకులు కాసేపు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఓ యాంకర్‌ ఇంకో యాంకర్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కృతి శెట్టి ఓ దశలో బిత్తర చూపులు చూసింది. అయితే వెంటనే ఆ ఇద్దరు యాంకర్లలో ఒక యాంకర్‌ ఇది అంతా ప్రాంక్‌ అని.. భయపడాల్సిన పనిలేదని సర్ది చెప్పాడు. అయినప్పటికీ కృతి శెట్టి భయపడింది. వెంటనే ఆమెకు జలజలా కన్నీటి ధార వచ్చేసింది. కాసేపు ఆమె కంటతడి పెట్టింది.

Krithi Shetty cried for doing funny video
Krithi Shetty

తనకు ఇలాంటివి అంటే అసలు నచ్చవని.. ఇంకోసారి ఇలా చేయొద్దని ఆమె కోరింది. దీంతో నిర్వాహకులు వచ్చి ఆమెకు సారీ చెప్పారు. కాగా కృతి శెట్టికి చెందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అసలు ఆమె ఎందుకు ఏడ్చింది ? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇదంతా ప్రాంక్‌ వల్లే జరిగిందని తెలుసుకుని మండిపడుతున్నారు. ఈమధ్య కాలంలో ప్రాంక్‌ వీడియోలు చేసేవారి సంఖ్య ఎక్కువవుతున్నందున.. ఏది నిజమైన సంఘటనో.. ఏది ఫేక్‌ సంఘటనో తెలియక జనాలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక కృతి శెట్టి అలా ఏడ్వడంతో ఆమెను ఓదారుస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెను కామెంట్ల రూపంలో ఓదారుస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment