Krishnam Raju Assets : కృష్ణం రాజుకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. ఆయన ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరిగి పోతుంది..!

September 11, 2022 11:38 AM

Krishnam Raju Assets : రెబ‌ల్ స్టార్‌గా ఎంతో మంది ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూర‌గొన్న కృష్ణం రాజు క‌న్నుమూశారు. దీంతో టాలీవుడ్ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. దాదాపుగా 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగ‌గా.. ఆయ‌న ఎన్నో హిట్ చిత్రాల‌ను అందించారు. రెబ‌ల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. రౌద్ర రసం, కరుణ రసం పండించడంలో ఆయనకి ఆయనే సాటి అని చెప్ప‌వ‌చ్చు.

కాగా కృష్ణం రాజు మృతితో అభిమానులు ఆయన జీవితాన్ని త‌ల‌చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కృష్ణం రాజు ఆస్తుల గురించి చర్చించుకుంటున్నారు. కృష్ణం రాజు 1940 జనవరి 20న మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మీ దేవి దంపతులకు జన్మించారు. వీరిది మొద‌టి నుంచి ధనిక కుటుంబమే. రాజ వంశానికి చెందిన‌వారు. ఇక కృష్ణం రాజుకి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి ఉంద‌ట‌. అలాగే మొగల్తూరులో ఒక భవనం, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో మొత్తం నాలుగు ఖరీదైన ఇల్లు ఉన్నాయ‌ట‌.

Krishnam Raju Assets do you know about the value of them
Krishnam Raju Assets

ఇక కృష్ణం రాజు ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి ఖరీదు రూ.18 కోట్లకు పైగానే ఉంటుంద‌ని తెలుస్తోంది. దీంతోపాటు హైదరాబాద్ లో కృష్ణం రాజుకి ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. ఇక గోపీకృష్ణ అనే నిర్మాణ సంస్థని కూడా కృష్ణం రాజు స్థాపించారు. కృష్ణం రాజు రూ.90 లక్షల విలువైన మెర్సిడెస్‌ బెంజ్ కారు, రూ.40 లక్షలు విలువైన టొయోటా ఫార్చునర్ కారు, రూ.90 లక్షల విలువైన వోల్వో ఎక్స్‌సి లాంటి కార్ల‌ను వాడుతున్నారు. అలాగే కృష్ణం రాజుది రాజుల కుటుంబం కాబట్టి వారి ఇంట్లో ఎప్పుడూ విందులు, పార్టీలు గ్రాండ్ గా జరుగుతూనే ఉంటాయి.

కృష్ణం రాజు లేదా ప్ర‌భాస్ ఎవ‌రైనా స‌రే.. త‌మ ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా.. నోరూరించే వంటకాలతో విందు భోజ‌నం పెట్టిస్తారు. అందువ‌ల్ల‌నే వారి విందుకు చాలా మంది ఫిదా అవుతుంటారు. ఇక ప్ర‌భాస్ కూడా కృష్ణం రాజు లాగే షూటింగ్ స‌మ‌యాల్లోనూ అంద‌రికీ ఇంటి నుంచి వండిన విందు భోజ‌నాన్ని తెప్పించి వ‌డ్డిస్తుంటారు. ఇప్ప‌టికే ప‌లువురు బాలీవుడ్ న‌టీన‌టులు కూడా ప్ర‌భాస్ ఆతిథ్యానికి ప‌డిపోయారు. ఇక ప్రభాస్ ఆస్తి విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ పెదనాన్ననే మించిపోయేలా సంపాదిస్తున్నాడు. కృష్ణం రాజుకి మొత్తం ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి ఉన్నారు. కుమారులు లేరు. అందువ‌ల్ల ప్ర‌భాస్ ఆయ‌న అంత్యక్రియ‌ల‌ను ద‌గ్గ‌రుండి చేస్తార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now