Krishna Vijaya Nirmala : సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల ప్రేమకథ భలే వెరైటీగా ఉంది..!

October 22, 2021 5:51 PM

Krishna Vijaya Nirmala know how they fall in love

Krishna Vijaya Nirmala : రెండు జీవితాల్ని ఒక్కటి చేసేదే ప్రేమ. అలాంటి ప్రేమకు అవధులు ఉండవు. వేరు వేరు అభిప్రాయాలున్నా.. ఒక్కటి చేసేదే ప్రేమబంధం. అలాంటి బంధంలో ఎన్ని అవకతవకలు ఉన్నా, సంతోషంతో సాగిపోయే ప్రేమబంధానికి మారు పేరుగా ఉన్న జంట సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల. వీరిద్దరి సినిమాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి వీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారో తెలుసుకుందాం.

ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసిన కృష్ణ రీసెంట్ ఇంటర్వూలో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల లవ్ స్టోరీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. వాళిద్దరి మధ్య పరిచయం, ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యిందో వివరించారు. కృష్ణ భోజన ప్రియుడు. ఆయన సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు విజయ నిర్మల దగ్గరుండి మరీ కృష్ణకు భోజనం తెచ్చేవారట. అలా మొదట వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యిందని అన్నారు. కేవలం భోజనం వల్ల మాత్రమే వారిద్దరి మధ్య క్లోజ్ నెస్ మరింత పెరిగిందని అన్నారు.

అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అన్నారు. ఇక విజయ నిర్మల ఇంటి భోజనం వల్ల కృష్ణకు ఒళ్ళు రావడం గానీ, పొట్ట గానే రాలేదని.. అందుకే విజయ నిర్మల భోజనం అంటే ఎంతో ఇష్టమని అన్నారు. అలా భోజనమే వాళ్ళిద్దర్ని కలిపిందని అన్నారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి దంపతుల్ని ఎవర్నీ చూడలేదని అన్నారు. అందరితోనూ ఎంతో మర్యాదపూర్వకంగా ఉండేవారని కాస్ట్యూమ్ కృష్ణ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now