Krishna : స‌ర్కారు వారి పాటపై నెగెటివ్ టాక్.. ఆ చాన‌ల్‌పై కృష్ణ ఫైర్‌..!

May 18, 2022 8:40 PM

Krishna : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ మే 12వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. నెమ్మ‌దిగా వేగం పుంజుకుంటోంది. అందులో భాగంగానే మ‌హేష్ ఫ్యాన్స్ కూడా సినిమా హిట్ అయ్యే సరికి ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఓ చాన‌ల్ మాత్రం ప‌నిగ‌ట్టుకుని మ‌రీ స‌ర్కారు వారి పాట మూవీపై తొలి రోజు నుంచే బుర‌ద జ‌ల్ల‌డం ప్రారంభించింది. దీనికి రాజ‌కీయ రంగు పులిమి నెగెటివ్ టాక్ మొద‌లు పెట్టింది. దీంతో ఆ చాన‌ల్‌పై మ‌హేష్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. భారీగా ట్రోల్ చేశారు.

ఇక స‌ర్కారు వారి పాట సినిమాపై నెగెటివ్ టాక్‌ను ప్ర‌చారం చేయ‌డంపై సూప‌ర్ స్టార్ కృష్ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హేష్ గ‌త కొన్నేళ్లుగా స‌మాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు చేస్తున్నాడ‌ని.. ఇలాంటి అవ‌కాశం అంద‌రు హీరోలకు రాద‌ని అన్నారు. స‌ర్కారు వారి పాట కూడా మంచి మెసేజ్ మూవీ అని.. తాను ఈ మూవీ దూకుడు, పోకిరి క‌న్నా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని చెప్పాన‌ని.. స‌రిగ్గా అలాగే జ‌రిగింద‌ని అన్నారు.

Krishna responded on success of Sarkaru Vaari Paata movie
Krishna

కాగా ఈ మూవీపై ఓ చాన‌ల్ నెగెటివ్ టాక్‌ను ప్రచారం చేయ‌డంతో కృష్ణ స్పందించారు. కొంద‌రు కావాల‌ని ప‌నిగట్టుకుని ఇలా చేస్తున్నార‌ని అన్నారు. మ‌హేష్ మొద‌టి నుంచి వివాద ర‌హితుడ‌ని.. సౌమ్యంగా ఉంటాడ‌ని.. అత‌నిపై నింద‌లు వేయ‌డం.. అత‌ని సినిమాపై నెగెటివ్ టాక్‌ను ప్ర‌చారం చేయ‌డం మంచిది కాద‌న్నారు. రాజ‌కీయ కోణంలో సినిమాను చూడ‌వ‌ద్ద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ఫ్యాన్స్ మాత్ర‌మే కాకుండా.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు ఈ మూవీని ఆద‌రిస్తుండ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now