Kota Srinivasa Rao : గత 40 సంవత్సరాలుగా వారి ఫుడ్డు తిన్నా.. వారికే ఓటు వేశా: కోట శ్రీనివాసరావు

October 18, 2021 5:02 PM

Kota Srinivasa Rao : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ ఎన్నికల వేడి తగ్గలేదని చెప్పాలి. ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు పరస్పర మాటల యుద్ధం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.

Kota Srinivasa Rao sensational comments on chiranjeevi and mohan babu

అసలు కోట శ్రీనివాసరావు మనిషి కాదు.. వాడు ఒక జంతువు.. రేపోమాపో పోతాడు.. అతనికి ఎందుకు ఈ మాటలు.. అంటూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలపై కోటశ్రీనివాసరావు స్పందిస్తూ తనదైనశైలిలో కామెంట్లు చేశారు. తాను ప్రకాష్ రాజ్ ని మంచి నటుడు కాదని ఎప్పుడూ అనలేదని.. అతను కేవలం షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తాడని మాత్రమే చెప్పానని తెలిపారు.

ఇక సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు నాగబాబు ఎవరు ? అంటూ ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా నాగబాబు మా అసోసియేషన్ లో ఉన్నా ఒరిగేది ఏమీ లేదంటూ నాగబాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మోహన్ బాబు మాట మాత్రమే కర్కశంగా ఉంటుందని మనసు మంచిదని, నేను వారి సామాజిక వర్గాన్ని గౌరవిస్తానని తెలిపారు. గత నలభై సంవత్సరాలుగా కమ్మవారి భోజనం చేస్తున్నాను.. ఆ విశ్వాసంతోనే నా ఓటును మంచు విష్ణుకి వేశానని ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మా ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now