Koratala Siva : రచయితగా కెరీర్ ని ఆరంభించి డైరెక్షన్ విభాగంలో అడుగుపెట్టిన దర్శకులలో కొరటాల శివ కూడా ఒకరు. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకునిగా పేరుతెచ్చుకున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజీ, భరత్ అను నేను చిత్రాలతో అపజయం ఎరుగని దర్శకుడిగా ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక సినిమాకి మంచి కథే సక్సెస్ కి కారణమని నమ్మే కొరటాల, రచయితల కన్న కూడా డైరెక్టర్లెకు ఎక్కువ గుర్తింపు ఉంటుందని నమ్మి దర్శకుడిగా మిర్చి చిత్రం ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు.
ఆయన ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడానికి, ఆయన సక్సెస్ వెనక కారణం తన భార్య అని చాలా సందర్భాల్లో కొరటాల శివ చెప్పుకొచ్చారు. అవును ప్రతి పురుషుని వెనుకా, ఓ స్త్రీ ఉంటుంది కదా. అలాగే కొరటాల శివ వెనుక ఉన్న స్త్రీ మూర్తి ఆయన భార్య అరవింద. ఆమె చాలా సింపుల్ వుంటారు. అరవింద లండన్ లో ఉన్నత విద్య చదువుకున్నారు.
కొరటాల శివలో ఉన్న నిజాయితీ ఆమెను కట్టి పడేయడంతో ఇద్దరి పరిచయం ప్రేమగా మారి వివాహం బంధంతో ఒకటయ్యారు. కానీ అనన్ని సమకూర్చిన ఆ దేవుడు ఈ జంటకు సంతాన ప్రాప్తి ఇవ్వలేదు. అయితే సమాజంలో గల చిన్నవాళ్లంతా తమ పిల్లలనే భావన గల ఆమె అదే దిశగా కొరటాలను కూడా ప్రోత్సహించింది. ఇద్దరు బతకాలంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుందని అరవింద ఎక్కువగా భావిస్తారట
ఇక ఆమె మొదటి నుంచి రామకృష్ణ పరమహంస భక్తురాలు కావటంతో రామకృష్ణుని బోధనలతో విశేషంగా ప్రభావితం అయింది. ప్రతి ఆదివారం ఆమె రామకృష్ణ మఠానికి వెళ్లి సేవలు అందిస్తుంది. ఇక శ్రీమంతుడు కాన్సెప్ట్ ఆమె ఫిలాసఫీ నుంచి వచ్చిందేనట. అందుకే కోట్లు సంపాదించినా నేటికీ చిన్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నారు ఈ దంపతులు.
ఎంత సంపాదించినా అవసరానికి మించి ఉండకూడదని, తినడానికి, బతకడానికి అవసరమైనది ఉంచుకుని మిగిలింది తిరిగి సమాజానికి తిరిగి ఇచ్చేయాలనే సిద్ధాంతం ఆమె ఫాలో అవుతారు. అందుకే సంపాదనలో అధికభాగం సమాజ సేవకే వినియోగిస్తూ ఆత్మతృప్తి పొందుతున్నారట అరవింద. డైరెక్టర్ లైఫ్ కన్నా ఓ మంచి వ్యక్తికి భర్తగా జీవితం చాలా బావుంటుందని కొరటాల చాలా సందర్భాల్లో భార్య అరవిందా గురించి చెప్పటం విశేషం.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…