Koratala Siva : ముదిరిన ఆచార్య వివాదం.. కొర‌టాల‌కు ఫ్యాన్స్ మ‌ద్ధ‌తు.. చిరు, చ‌ర‌ణ్‌ల‌పై భారీగా ట్రోలింగ్‌..!

July 13, 2022 8:46 PM

Koratala Siva : ఆచార్య భారీ డిజాస్టార్ అవ‌డం ఏమోగానీ.. రోజు రోజుకీ ఈ వివాదం ముదురుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మూవీకి గాను రూ.84 కోట్ల మేర నష్టాలు వ‌చ్చాయి. దీంతో డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఆ మొత్తాన్ని వెన‌క్కి ఇచ్చేస్తామ‌ని గ‌తంలోనే చ‌ర‌ణ్ తోపాటు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కూడా చెప్పారు. అయితే కొర‌టాల శివ ఆ మొత్తంలో కొంత మేర ఇస్తాన‌ని అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే ఆయ‌న త‌న ఆస్తుల‌ను అమ్ముకున్నారని.. ఆ మొత్తాన్ని ఇచ్చేశార‌ని తెలుస్తోంది. అయితే మెగా ఫ్యామిలీ వైపు నుంచి డ‌బ్బును వెన‌క్కి ఇచ్చేశారా.. లేదా.. అన్న విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త రాలేదు. కానీ ఆచార్య వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయిన త‌మ‌ను ఆదుకోవాల‌ని కొర‌టాల ఆఫీస్ ద‌గ్గ‌ర డిస్ట్రిబ్యూట‌ర్లు ధ‌ర్నా చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. దీంతో ఈ వివాదం మ‌రింత ముదిరిన‌ట్లు అయింది.

అయితే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు ఈ విష‌యంలో ఫ్యాన్స్ నుంచి మ‌ద్ధ‌తు ల‌భిస్తోంది. జ‌స్టిస్ ఫ‌ర్ కొర‌టాల శివ పేరిట ఓ హ్యాష్ ట్యాగ్‌ను వారు ట్రెండ్ చేస్తున్నారు. ఈ విష‌యంలో వారు చిరంజీవి, చ‌ర‌ణ్ ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. కొర‌టాలకు అస‌లు ఓట‌మి లేద‌ని.. అలాంటిది ఆచార్య ఫ్లాప్ అయిందంటే అందుకు కార‌ణం చిరు, చ‌ర‌ణ్‌లు క‌థ‌లో క‌ల‌గ‌జేసుకోవ‌డ‌మే అని అంటున్నారు. ఈ విష‌యంలో వారు కొర‌టాల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి.. వెంట‌నే న‌ష్ట ప‌రిహారం మొత్తాన్ని చెల్లించాల‌ని అంటున్నారు.

Koratala Siva in Acharya movie controversy fans demand justice for him
Koratala Siva

అయితే మ‌రోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం కొర‌టాల ఫ్యాన్స్‌కు కౌంట‌ర్ వేస్తున్నారు. అస‌లు సినిమా క‌థ, అవుట్ పుట్‌పై దృష్టి పెట్ట‌కుండా కొర‌టాల ఈ మూవీకి చెందిన బిజినెస్ వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చార‌ని.. అస‌లు ఆయ‌న‌ను ఇందులో డ‌బ్బులు ఎవ‌రు పెట్ట‌మ‌న్నార‌ని.. కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ వార్ సోష‌ల్ మీడియాలో మ‌రింత ముదిరింది. అయితే ఈ వ్య‌వ‌హారం చివ‌ర‌కు ఏమ‌వుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now