Kondapolam : కొండ‌పొలం చిత్ర యూనిట్‌కు షాక్‌.. సినిమా మొత్తం లీక్ చేశారు..

October 9, 2021 10:37 PM

Kondapolam : క్రిష్ ద‌ర్శక‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌లు జంట‌గా న‌టించిన చిత్రం కొండ‌పొలం. ఈ మూవీ అక్టోబ‌ర్ 8న థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో వైష్ణ‌వ్ తేజ్‌కు మ‌రో హిట్ గ్యారెంటీ అని భావిస్తున్నారు. అయితే ఇంత‌లోనే కొండ‌పొలం చిత్ర యూనిట్‌కు షాక్ త‌గిలింది. ఆ సినిమా మొత్తాన్ని ఇంట‌ర్నెట్‌లో లీక్ చేశారు.

Kondapolam movie leaked in tamil rockers web site

అక్టోబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన కొండ‌పొలం మూవీకి అన్ని వ‌ర్గాల నుంచి చక్క‌ని ఆద‌ర‌ణ లభిస్తోంది. ప్రేక్ష‌కుల‌తోపాటు సినీ విమ‌ర్శ‌కులు కూడా సినిమా బాగుంద‌ని కితాబిస్తున్నారు. అయితే విడుద‌లై ఒక్క రోజు కూడా గ‌డ‌వ‌క ముందే చిత్ర యూనిట్‌కు దిమ్మ తిరిగింది. మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన‌గా.. మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధిస్తుంద‌ని ధీమాతో ఉన్నారు. మూవీ కూడా అలాగే బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. కానీ ఈ మూవీని త‌మిళ రాక‌ర్స్ అనే సైట్ వారు లీక్ చేయ‌డంతో ఆ ప్ర‌భావం సినిమా క‌లెక్ష‌న్ల‌పై ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

అయితే ఇప్ప‌టికే అనేక చిత్రాలు పైర‌సీ కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. కెరీర్ తొలినాళ్లు కావ‌డంతో వైష్ణ‌వ్ తేజ్ కూడా మంచి ఊపు మీద ఉన్నాడు. కానీ ఈ విధంగా సినిమా పైర‌సీ అయితే వారు ప‌డే బాధ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. కొన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి వారు సినిమా తీస్తారు. ఈ విధంగా పైర‌సీ అవ‌డం అంటే.. నిర్మాత‌ల‌కే కాదు, చిత్ర యూనిట్ మొత్తానికీ విచార‌క‌ర‌మైన వార్తేన‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now