Komuram Bheemudo : కొమరం భీముడో పాటకు అదే స్ఫూర్తి.. వెల్ల‌డించిన‌ రాజమౌళి..

August 19, 2022 7:04 AM

Komuram Bheemudo : ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. బాహుబలి నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించినవాళ్ళ నిరాశకి చోటే లేకుండా చేశాడు రాజమౌళి. ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో ఎక్కువ భాగం జనాలను ఆకర్షించడానికి కమర్షియల్ అంశాలు ఉంటాయి. బాహుబలి అనంతరం టాలీవుడ్ టాప్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమురం భీమ్‌ల ఫిక్షన్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. తాజాగా ప్రముఖ హోస్టులు జోష్ ఓల్సన్, జో డాంటే పోడ్‌కాస్ట్‌ కు రాజమౌళి హాజరయ్యారు. పోడ్‌కాస్ట్‌లో రాజమౌళి తనకు స్ఫూర్తినిచ్చిన చిత్రాల గురించి మాట్లాడారు.

Komuram Bheemudo song inspiration said by Rajamouli
Komuram Bheemudo

వారితో మాట్లాడుతున్నప్పుడు ఆర్ఆర్ఆర్ రెండవ భాగంలో కొమరం భీముడో పాట వెనుక మెల్ గిబ్సన్ తీసిన‌ బ్రేవ్‌హార్ట్ మూవీ తనకు గొప్ప ప్రేరణ అని రాజమౌళి వెల్లడించారు. నేను ఆ మూవీ క్లైమాక్స్ నుండి ప్రేరణ పొందాను అని జక్కన్న వెల్లడించాడు. అలాగే మెల్ గిబ్సన్ తనకు ద్రోణాచార్యుడని నేను ఆయనకు ఏకలవ్య శిష్యుడిని అని రాజమౌళి అన్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్ వచ్చే ఏడాది ఆస్కార్‌కి నామినేట్ అయ్యే అవకాశం ఉందని అలాగే విదేశీ ఫిల్మ్ విభాగంలో అవార్డు కూడా గెలుచుకోవచ్చని అనురాగ్ కశ్యప్ ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now