Kodali Nani : హీరోలు కిరాణా షాపులు పెట్టుకోండంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఏపీ మంత్రి..

December 28, 2021 7:06 PM

Kodali Nani : గ‌త కొద్ది రోజులుగా ఏపీలో సినిమా థియేటర్స్‌పై దాడులు, సీజ్‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రో వైపు టిక్కెట్ రేట్స్ కూడా భారీగా త‌గ్గించ‌డంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. థియేటర్లకు వచ్చే కలెక్షన్ల కంటే కిరాణా షాపులకు వచ్చే కలెక్షన్లే ఎక్కువని నాని అన్నాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని చెప్పాడు.

Kodali Nani said heroes should open grocery stores

టిక్కెట్ రేట్స్ పెంచ‌డం అంటే ప్రేక్ష‌కుల‌ని అవ‌మానించ‌డ‌మేన‌ని నాని సంచల‌న కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని కూడా హీరో నాని వ్యాఖ్యలపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కిరాణా కొట్టుకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చినపుడు సినిమా వాళ్లు తమ పెట్టుబడులను కిరాణా కొట్లలో పెట్టుకోవచ్చు కదా ? అంటూ సెటైర్లు వేశారు.

సినిమా టికెట్ ధరలను తమ ప్రభుత్వం తగ్గించలేదని ఆయన అన్నారు. కొన్ని సినిమాలకు రేట్లు పెంచమని గతంలో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకునేవారని.. అలాంటి పరిస్థితి ఉండకూడదనే తమ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని చెప్పారు.

తాము టికెట్ ధరలను తగ్గించలేదని అన్నారు. టికెట్ ధరలు తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టమని అంటున్నారని.. ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now