Kiara Advani : కియారా అద్వానీ యాడ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్‌.. అది స్పోర్ట్స్ బ్రా యాడ్ కాదు.. అని కామెంట్స్‌..

November 21, 2021 12:35 PM

Kiara Advani : న‌టి కియారా అద్వానీ బోల్డ్ స‌న్నివేశాల్లో చేసేందుకు ఎంత మాత్రం మొహ‌మాట ప‌డ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. ఆ మాట‌కొస్తే ఆమె న‌టించిన కొన్ని సిరీస్‌లలో విప‌రీత‌మైన బోల్డ్ క్యారెక్ట‌ర్ల‌లో న‌టించింది. అయితే ఇప్పుడు ఆమె అడ్వ‌ర్టయిజ్‌మెంట్ల విష‌యంలోనూ అదే ప‌ద్ధ‌తిని పాటిస్తోంది. ఏ బ్రాండ్‌కు యాడ్ చేసినా.. స్కిన్ షో చేస్తోంది. అది స‌రే.. అంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. తేడా వస్తే మాత్రం నెటిజ‌న్ల చేతిలో ట్రోలింగ్ కు గురి కాక త‌ప్ప‌డం లేదు. తాజాగా కియారాకు అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

Kiara Advani trolled by netizen for her ad

కియారా అద్వానీ ఇటు తెలుగు, అటు హిందీ మూవీల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అలాగే ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చారం కూడా చేస్తోంది. ఇక బోట్ కంపెనీకి కూడా ఆమె బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎప్ప‌టినుంచో కొన‌సాగుతోంది. స‌ద‌రు కంపెనీ ప‌లు ర‌కాల ఆడియో ప్రొడ‌క్ట్స్‌ను త‌యారు చేయ‌డంలో పేరు గాంచింది. అయితే ఆ కంపెనీకి చెందిన వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్ ప్యాక్‌పై కియారా అద్వానీ ఫొటోను ముద్రించారు.

స‌ద‌రు ఫొటోలో కియారా స్పోర్ట్స్ బ్రా ధ‌రించి ఉంది. కానీ ఆమె చెవుల్లో ఉన్న బోట్ కంపెనీకి చెందిన ఇయర్ బ‌డ్స్ క‌నిపించ‌డం లేదు. దీంతో నెటిజ‌న్లు ట్రోలింగ్ మొద‌లు పెట్టారు.

https://twitter.com/its_rahulkr/status/1462073681916542984

అస‌లు ఆమె ఇయ‌ర్ బ‌డ్స్ కు ప్ర‌చారం చేస్తుందా.. లేదా స్కిన్ షో చేస్తుందా.. లేక ఏదైనా కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బ్రాను ప్ర‌చారం చేస్తుందా..? అని కియారా అద్వానీని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. వాస్త‌వానికి ఆ ఫొటోను 1 నిమిషం పాటు జాగ్ర‌త్త‌గా చూస్తేనే త‌ప్ప ఆమె చెవుల్లో ఇయ‌ర్ బ‌డ్స్ ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. దీంతో ఆ ఫొటోను చూస్తే నిజంగానే అది స్పోర్ట్స్‌బ్రాకు చెందిన యాడ్ అనుకుంటారు. అందుక‌నే నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ఇక ప్ర‌స్తుతం కియారా అద్వానీ బాలీవుడ్‌లో భూల్ భుల‌య్యా 2 అనే మూవీతోపాటు జుగ్ జుగ్ జీయో అనే మూవీలోనూ న‌టిస్తోంది. తెలుగులో ఈమె రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న మూవీలో న‌టిస్తోంది. ఆ మూవీకి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now