Kiara Advani : అలాంటి అవ‌కాశాల‌ను అస్స‌లు వ‌దులుకోను.. కియారా అద్వానీ..!

October 14, 2021 9:37 PM

Kiara Advani : అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ ప‌లు మూవీల్లో న‌టించిన కియారా అద్వానీ చ‌క్క‌ని గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కొన్ని సినిమాల్లోనే న‌టించింది. అయిన‌ప్ప‌టికీ న‌టిగా తానేంటో నిరూపించుకుంది. ఇక టాలీవుడ్‌, బాలీవుడ్‌ల‌లో ఈ భామ ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ ఎంతో బిజీగా ఉంది.

Kiara Advani says she will not miss chances like kabir singh movies

బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో క‌లిసి కియారా న‌టించిన క‌బీర్ సింగ్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే తాజాగా ఓ సంద‌ర్భంలో ఆమె మాట్లాడుతూ.. మ‌రో సారి క‌బీర్ సింగ్ లాంటి మూవీలో అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌క చేస్తాన‌ని.. అలాంటి అవ‌కాశాల‌ను అస్స‌లే వదులుకోన‌ని.. కియారా తెలిపింది.

కాగా కియారా అద్వానీ శంక‌ర్ సినిమాలో న‌టించే చాన్స్ కొట్టేసింది. అందులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్నారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాను కబీర్‌సింగ్ పేరిట హిందీలో తీసినా.. మొద‌ట్లో అనుమానాలు ఉండేవి. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆ మూవీ చ‌క్క‌ని విజ‌యం సాధించింది. దీంతో కియారాకు మంచి మార్కులే ప‌డ్డాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now