Kiara Advani : 2014లో ఫుగ్లీ చిత్రంతో బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కియారా అద్వానీ. ఆ తర్వాత సుశాంత్ రాజ్ పూత్ హీరోగా నటించిన ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీ చిత్రంలో ధోనీ భార్యగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. 2018లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. భరత్ అనే నేను చిత్రంతో సక్సెస్ ను అందుకుని హీరో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.
అయితే వినయ విధేయ రామ ఆశించిన మేరకు విజయం సాధించకపోవడంతో మరలా తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇప్పుడు ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్న Rc15 లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ Rc15 చిత్రానికి సర్కారోడు పేరు పెట్టినట్లు వార్త వినిపిస్తోంది.
ఈ బ్యూటీ తాజాగా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వీళ్లిద్దరూ సీక్రెట్ గా కాపురం పెట్టేశారు అనే టైంలో బ్రేకప్ చెప్పుకున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక ఇటీవలే లైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా వీరిద్దరి రిలేషన్ షిప్ పై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా కియారా అద్వానీ తన 30వ పుట్టిన రోజును దుబాయ్ లో గ్రాండ్ గా జరుపుకుంది. ఈ పుట్టినరోజు వేడుకలలో కియారా అద్వానీతోపాటు సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. వీళ్ల బ్రేకప్ విషయంలో నిజమెంతో తెలియాలంటే, ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. అప్పుడు గానీ అందరిలో ఉన్న ఈ సస్పెన్స్ కి బ్రేక్ పడదు. మరి వీరిద్దరూ ఏం చేస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…