Student No.1 : దర్శకధీరుడు రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే రాజమౌళి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. ఇటీవలి కాలంలో హాస్య నటుడు ఆలీ హోస్ట్ చేస్తున్న ఆలీతో సరదాగా షోకి పలువురు సెలబ్రెటీలు విచ్చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
ఆలీతో సరదాగా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనేక విషయాలను చెప్పుకొచ్చిన అశ్వినీ దత్.. స్టూడెంట్ నెం.1 చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ కాదని ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఈ సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించాల్సి ఉందని, అయితే హరికృష్ణ తనకు ఫోన్ చేయడంతో పరిస్థితులు మారిపోయాయని ఆయన తెలిపారు.
అలాగే.. ఇంకా ఇండస్ట్రీ స్ట్రైక్ చేసినా, చేయకున్నా ఒక షెడ్యూల్ ఉంటే ప్రభాస్ తో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కె షూట్ కొనసాగించేవాడినని సీనియర్ నిర్మాత వ్యాఖ్యానించారు. ఈ ప్రోమో చూసిన అనంతరం అంతా పూర్తి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు నిర్మించిన వైజయంతి మూవీస్ ఆమధ్య వరస పరాజయాలతో కొనసాగుతున్న సమయంలో అల్లుడు నాగ్ అశ్విన్ మహానటితో వైజయంతి మూవీస్ కి పూర్వ వైభవం తీసుకొచ్చాడు. అనంతరం జాతిరత్నాలు, ఇప్పుడు సీతారామం ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోంది వైజయంతి మూవీస్.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…