Khiladi Movie : ర‌వితేజ ఖిలాడీ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

February 3, 2022 3:26 PM

Khiladi Movie : మాస్ మ‌హారాజ ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం.. ఖిలాడి. ఇందులో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన విడుద‌ల కానుంది. దీనికి ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. అయితే విడుద‌ల కాక‌ముందే ఈ మూవీ భారీగా బిజినెస్ చేసింది. దీంతో చిత్ర‌యూనిట్ ఆనందం వ్య‌క్తం చేస్తోంది.

Khiladi Movie to stream on OTT know which one
Khiladi Movie

కాగా ఖిలాడీ మూవీ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. అందువ‌ల్ల ఈ మూవీ ఆ యాప్‌లో స్ట్రీమ్ కానుంది. ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన మూవీ రిలీజ్ అయితే.. 35 రోజుల త‌రువాత‌.. అంటే.. మార్చి 18వ తేదీన ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంద‌ని తెలుస్తోంది.

పెన్ మూవీస్‌, ఎ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించ‌గా.. ఇందులో అర్జున్ సర్జా, ముకేష్ రిషి, రావు ర‌మేష్ లు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now