Keerthy Suresh : సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రీసెంట్‌గా చిత్రీకరణ పూర్తి చేసుకొని మే 12న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో మూవీ టీం బిజీ అయ్యింది. తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.
షూటింగ్ సమయంలో తాను టైమింగ్ కోల్పోయి.. స్టెప్పులు మర్చిపోయి.. రెండు సార్లు మిస్ టైమింగ్ తో మహేష్ ను కొట్టినట్లు కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అయితే మూడో సారి దానికి సారీ చెప్పానని.. అయితే మూడోసారి కూడా పొరపాటున కొట్టినట్లు చెప్పింది. దీని తర్వాత నాపై కోపం ఏమైనా ఉందా ? అని మహేశ్ సరదాగా అడిగారని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. మహేష్ షూటింగ్‌లో చాలా సరదాగా ఉంటారనే సంగతి తెలిసిందే. తన తోటి ఆర్టిస్టులతో జోకులు చేస్తూ సరదాగా షూటింగ్ లో పాల్గొంటారు.
హాఫ్ స్క్రీన్‌లో మహేశ్ బాబు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందని కీర్తి సురేష్‌ని అడగ్గా.. ఆయనతో షూటింగ్ చాలా సరదాగా ఉంటుందని కీర్తి సురేష్ పేర్కొంది. సర్కారు వారి పాట మూవీపై పూర్తి పాజిటివ్ బజ్ నడుస్తోంది. అదే సమయంలో మహేష్ ఫ్యాన్స్ ని మరో భయం వెంటాడుతుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న మహేష్ కి కీర్తి సురేష్ కారణంగా ప్లాప్ పడితే పరిస్థితి ఏమిటంటూ ఆందోళన చెందుతున్నారు. ప్లాప్స్ లో ఉన్న కీర్తి తన సెంటిమెంట్ కొనసాగిస్తూ మహేష్ కి కూడా ప్లాప్ ఇస్తుందేమోనని కంగారు పడుతున్నారు. మరోవైపు మే నెలలో విడుదలైన మహేష్ సినిమాలు ఫ్లాపుల బాట పట్టగా, ఇది కూడా అభిమానులని కలవర పెడుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…