Kasthuri Shankar : నయన్ దంపతులు చేసిన పని చట్టరీత్యా నేరం.. సీనియర్ నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు..!

October 11, 2022 8:13 AM

Kasthuri Shankar : ఈ ఆదివారం నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్టు ప్రకటించారు. నయన్ అండ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్‌లో కుటుంబ సమేతంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళై 4 నెలలు కూడా గడవకముందే కవల అబ్బాయిలకు నయన్ విగ్నేష్ తల్లిదండ్రులు అయ్యారు. అద్దె గర్భం.. అంటే మరో మహిళ గర్భంతో వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. చాలామంది సెలెబ్రిటీలు ఇదే విధానంలో తల్లిదండ్రులు అవుతున్నారు.

ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ లాంటి సీలెబ్రిటీలంతా సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కన్నారు. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. నయనతారకి కవలలు పుట్టిన వేళ సీనియర్ హీరోయిన్ కస్తూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతదేశంలో సరోగసీ నిషేధించబడింది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం.

Kasthuri Shankar sensational comments on Nayanthara
Kasthuri Shankar

ఇది జనవరి 2022 నుండి వచ్చిన చట్టం. దీని గురించి మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం అంటూ ట్వీట్ చేసింది. కస్తూరి ఈ ట్వీట్ నయనతారని ఉద్దేశించే చేసింది అంటూ కొందరు ఆమెని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరికొందరు ఈ విషయాన్ని ధైర్యంగా చెబుతున్నారు అంటూ ఆమెకు సపోర్ట్ చేశారు. నన్ను విమర్శించే వాళ్లకు ముందే తెలిసి ఉండాలి. నేను అన్ని వివరాలు తెలుసుకునే ఈ కామెంట్స్ చేశాను. నా లెక్కలు నాకు ఉన్నాయి. నిస్వార్థంగా నా గళం వినిపిస్తున్నాను అంటూ కస్తూరి మరో ట్వీట్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now