Karthikeya 2 : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న కార్తికేయ 2.. ఎందులో.. ఎప్పుడు అంటే..?

September 11, 2022 5:48 PM

Karthikeya 2 : చిన్న సినిమాగా వ‌చ్చిన కార్తికేయ 2 ఎవ‌రూ ఊహించ‌ని విధంగా హీరో నిఖిల్ కెరీర్ లోనే అతి భారీ విజ‌యాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఎంతో వేగంగా రూ.100 కోట్ల వ‌సూళ్ల మైలురాయిని కూడా దాటేసింది. అభిషేక్ ఆర్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ లు హీరో హారోయిన్లుగా న‌టించ‌గా చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించి మెప్పించారు. ఆయ‌న కారెక్ట‌ర్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్ప‌వచ్చు.

ఇక ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే శ్రీ కృష్ణుడి కాలానికి చెందిన ఒక ర‌హ‌స్యాన్ని ఛేదించే క్ర‌మంలో క‌థానాయ‌కుడు చేసిన సాహ‌సాలు అంద‌రినీ అబ్బుర ప‌రుస్తాయి. ద్వాప‌ర యుగంలో శ్రీ కృష్ణుడికి చెందిన‌దిగా భావించే ఒక అమూల్య‌మైన సంప‌ద‌ను కాపాడ‌టానికి హీరో బ‌య‌లుదేరతాడు. అది క‌లియుగంలో మాన‌వుల‌కు దిక్సూచిగా చెప్ప‌బ‌డుతుంది. ఈ క్ర‌మంలో అత‌నికి ఎన్నో దుష్ట శ‌క్తులు ఎదుర‌వుతాయి. ఈ ప్ర‌యాణంలో అత‌ను శ్రీ కృష్ణుడి గొప్ప‌ద‌నాన్ని కూడా తెలుసుకుంటాడు.

Karthikeya 2 releasing on OTT know which app details here
Karthikeya 2

ఇక అన్ని చిత్రాల లాగానే ఈ సినిమా కూడా విడుద‌లైన 45 రోజుల త‌రువాత ఓటీటీలోకి రానుంది. ఈ క్ర‌మంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో సెప్టెంబ‌ర్ 30 నుండి ప్ర‌సారం కానుంది. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇక ఆగ‌స్టు 13న విడుద‌లైన కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్ ను మ‌లుపు తిప్పింది. ఇది ఆయ‌న సినీ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎన్నో పెద్ద సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ చిత్రం ముందు నిల‌వ‌లేక‌పోవ‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ సినిమా రూ.120 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇంకా చాలా థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now