Karthika Deepam Monitha : త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కార్తీకదీపం మోనిత..?

April 24, 2022 11:11 PM

Karthika Deepam Monitha : బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకుని ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సీరియల్లో దీపా, కార్తీక్, మోనిత పాత్రలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులో లేడీ విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న మోనిత అసలు పేరు శోభా శెట్టి. ఈమె కన్నడ సినీ పరిశ్రమకు చెందినది.

Karthika Deepam Monitha may marry soon an actor from kannada industry

కన్నడ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో, సీరియల్స్‌లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈమె తెలుగులో కూడా నటిస్తూ అచ్చతెలుగు అమ్మాయిలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సీరియల్ లో శాడిజం చూపించే మోనిత నిజ జీవితంలో మాత్రం ఎంతో మంచి మనసున్న వ్యక్తి. అయితే తాజాగా ఈమె గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

త్వరలోనే శోభా శెట్టి పెళ్లి పీటలు ఎక్కబోతున్నటు పెద్ద ఎత్తున కథనాలు వినబడుతున్నాయి. అయితే అతను, ఎవరు, ఏమిటి.. అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక పేరు పొందిన సీరియల్ నటుడిని మోనిత పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. కొంత కాలం వరకు వేచి చూడక తప్పదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now