Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక మోనిత కార్తీక్ పెట్టిన క్యాంపు దగ్గరికి వచ్చి కాసేపు గొడవ చేస్తుంది. బస్తీ వాళ్ళ ముందు కార్తీక్ పరువు తీయడానికి ప్రయత్నిస్తుంది. కార్తీక్ మోనితపై అరుస్తాడు. అయినా కూడా మోనిత వీడియో చూసినంత మాత్రాన నా పని మొత్తం అయిపోయింది అనుకోకండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆనందరావు వచ్చి ఆమెపై కాసేపు అరుస్తాడు. వెంటనే దీప కోపంతో రగిలిపోతూ బస్తీ వాళ్ల గురించి చెబుతుంది.
ఇక బస్తీ వాళ్లకు మోనిత చేసిన మోసాల గురించి, తప్పుల గురించి చెబుతూ ఇలా చేసిన వాళ్లకి మీరు ఎలాంటి బుద్ధి చెబుతారో అని బస్తీ వాళ్ళని ప్రశ్నించింది దీప. వెంటనే బస్తీ వాళ్ళు మోనిత పైకి చీపుర్లు తీసుకొని వస్తారు. పక్కనే ఉన్న ప్రియమణి భయపడటంతో మోనితను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కారు దగ్గరికి వెళ్లి కార్తీక్, దీపకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
ఇంట్లో పిల్లలు ఇద్దరూ.. సైలెంట్ గా ఉంది ఏంటి అని అనేసరికి.. ఆదిత్య వచ్చి బస్తీకి వెళ్ళారని అంటాడు. అప్పుడే పిల్లలు బస్తీ అనగానే మురిసిపోతారు. ఎప్పుడూ అక్కడే ఉంటే బాగుంటుంది అనేసరికి, ఆదిత్య వాళ్ళపై కోపంతో అరుస్తాడు.
మరోవైపు మోనిత ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా భోజనం చేస్తూ దీప పని చేస్తాను అని మాట్లాడుతుంది. ప్రియమణి మాత్రం మోనిత మాటలకు షాక్ అవుతుంటుంది. రేపటి నుంచి అసలైన ఆట మొదలవుతుంది అనేసరికి ఏదో ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది.
కార్తీక్ వంట గదిలో దీపకు సహాయం చేస్తాడు. కాసేపు వారి మధ్య సరదాగా సాగుతుంది. ఇక దీప బస్తీలో ఇల్లు కడతామని అనేసరికి కార్తీక్ ఒప్పుకుంటాడు. అప్పుడే సౌందర్య రావటంతో బస్తీలో హాస్పిటల్, ఇల్లు కట్టాలనుకుంటున్నాం అనేసరికి సౌందర్య దిగులు పడుతుంది. మమ్మల్ని వదిలేసి దూరంగా ఉంటారా అనేసరికి కార్తీక్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి సౌందర్య ఒప్పుకోవడంతో సంతోషంగా ఉంటారు. ఆనందరావు వచ్చి వారితో కాసేపు సరదాగా గడుపుతాడు. ఇక పిల్లలిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని అనుకుంటారు.
తరువాయి భాగంలో డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కార్తీక్ ను డాక్టర్స్ ఎన్నుకోవడంతో మోనిత వచ్చి కార్తీక్ పరువు తీయాలనుకుంటుంది. వెంటనే దీప మోనితను మరో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…