Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ గేమ్ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 12వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారం రవి రూపంలో ఊహించని కంటెస్టెంట్ బయటకు వచ్చారు. అతను బయటకు రావడాన్ని రవి అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కావాలనే రవిని ఇంటి నుంచి బయటకు పంపేశారని.. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు ప్రియాంక సింగ్, కాజల్ కంటే తక్కువ ఓట్లు ఎలా పడతాయి ? అని అంటున్నారు.
మీరు ఓట్ల లెక్క చూపించండి.. అప్పుడే మేము నమ్ముతాము, లేదంటే యాంకర్ రవిని కావాలనే ఎలిమినేట్ చేశారనే విషయం నిజమే అని అందరికీ తెలుస్తుంది అంటున్నారు రవి ఫాలోవర్స్. రవిని బిగ్‌బాస్ పంపించివేయడానికి భారీ రెమ్యునరేషన్ కూడా ఒక కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్యలో ఇస్తున్నారట.
రవి 12 వారాలకే 90 లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది బిగ్‌బాస్ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్‌మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం! బిగ్‌బాస్ షో ముగింపుకు వచ్చినందున రవికి అంత మొత్తంలో డబ్బులు వెచ్చించలేక రవిని ఎలిమినేషన్ రూపంలో బయటకు పంపంచినట్టు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా రవి ఎలిమినేషన్‌లో ఏదో సీక్రసీ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ విన్నర్ రూ.50 లక్షలతోపాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్ని సైతం సొంతం చేసుకోనున్నట్లు నాగార్జున వెల్లడించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…